30.03.2013 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 55వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః |
అంభోనిది రనంతాత్మా మహోదధి శయో అంతకః ||
తాత్పర్యం : పరమాత్మను జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, సాక్షిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను బిందువులతో కూడిన మహా సముద్రముగా అట్టి మహా సముద్రమునందు అనంతముగా శయనించి యుండువానిగా, మరల అట్టి సముద్రమే భౌతిక జీవులకు లయస్థానముగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
22 వ.అధ్యాయము
25.01.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులను విషజంతువుల బారినుండి కాపాడిన సంఘటనలు వివరించబడినవి. మరి మనిషికి నిలువెల్ల విషమే కదా - అటువంటి మనుషులనుండి కూడ తన భక్తులను అనేకసార్లు కాపాడినారు శ్రీసాయి.