22.02.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 4 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
దీనికి సంబంధించిన అన్ని హక్కులు
సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ
భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను.
సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2005
మార్చ్ నెల
మహాశివరాత్రి – బరువయిన హృదయభారంతో షిరిడీ నుంచి సిడ్నీకి తిరిగి వచ్చాను. మరలా ఇంకొకసారి భాతదేశానికి
వెళ్ళాలనుకుంటున్నాను. మహాశివరాత్రి పండగ సమయం. నాకు హిందూదేవతల గురించి అన్ని రూపాల దేవుళ్ల గురించి, పధ్ధతుల గురించి తెలియకపోయినా, మరలా వచ్చే సంవత్సరానికి
మహాశివరాత్రి పర్వదినం వస్తుందనే ఒక విధమయిన ఆనందం నాలో ఎపుడూ కలుగుతూ ఉంటుంది. షిరిడీ సాయిబాబాయే నా పరమశివుడు
కాబట్టి ఆయన నాలో అటువంటి ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటారు. శివరాత్రికి 9 రోజుల
ముందునుంచి నిరంతరం ఆపకుండా “నమఃశ్శివాయ” అని జపించుకుంటూ ఉన్నాను. నామసప్తాహం పూర్తయేటప్పటికి
శివషిరిడీసాయి నుంచి ప్రతిఫలాన్ని కూడా ఆశించడం కూడా ఒక కారణం.