Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 23, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (12)

0 comments Posted by tyagaraju on 9:00 AM

                                                  



23.06.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

సాయి.బా.ని.స. డైరీ - 1998 (12)








03.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ప్రభుత్వమువారు గోదావరి నదికి ఆనకట్ట కట్టి ఆనీరును నీపంటపొలాలకు అంద చేస్తున్నారు.  



నీవు ఆనీరుతో మంచి పంటలు పండించి సుఖశాంతులతో జీవించుతున్నావు .  



మరి అటువంటి అపుడు నీవు ప్రభుత్వమువారికి శిస్థు కట్టవలసియున్నది కదా.  అదే విధముగా భగవంతుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత భగవంతుని సదా స్మరించుతు జీవించాలి కదా. 

2) నీజీవిత ఆఖరి దశలో నీతో కలసి ప్రయాణము చేయడానికి నీవాళ్ళు ఎవరు సిధ్ధపడరు.  ఆవిషయాన్ని నీవు గ్ర్రహించి సద్గురువు సహాయముతో ఒంటరి జీవితాన్ని ప్రారంభించు.  ఒంటరిగా ప్రయాణము సాగించుతు నీగమ్య స్థానము చేరుకో.




09.08.1978

నిన్నరాత్రి శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకు అన్యాయము చేయడానికి సిధ్ధపడినవారిని నీవు యుక్తితో ఎదుర్కొని వారికి బుధ్ధి చెప్పాలి.

2) తల్లితండ్రులు పిల్లల మధ్య బంధుత్వము అనే గొలుసువంటివారు.  ఒకవేళ గొలుసు  తెగినరోజున బంధుత్వాలు దూరము అయిపోతాయి.  దాని గురించి  ఎక్కువ బాధపడరాదు.

3) నీచొక్క జేబులో రూపాయ నోట్లకట్టలు దాచుకొని జాగ్రత్తపడుతున్నావే, మరి ఆనోట్ల కట్టలును నీకు ప్రసాదించిన ఆభగవంతుని నీగుండెలో దాచుకొంటున్నావా ఒక్కసారి ఆలోచించు.

4) పెద్దలు చేసిన పొరపాట్లుకు పిల్లలు కష్ఠాలు పడక తప్పదు.  అదే దేశ  రాజకీయాలలో నాయకులు చేసే పొరపాట్లుకు ప్రజలు బాధపండుతున్నారు.  అందుచేత భావి తరాలకు మంచి రోజులు కావాలి అంటే ఈనాడు మనము పొరపాట్లు చేయరాదు.


11.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1)పంజరములోని చిలుక తనకు జామపండ్లు యితర పండ్లు, ఫలాలు లభించినంత కాలము పంజరములో సుఖముగానే యుంటుంది. 




 అలాగే మన శరీరము  ఆరోగ్యముగా  ఉన్నంత  కాలము మన ఆత్మ ఆ శరీరములో సుఖముగానే యుంటుంది.  పంజరములోని చిలుకకు పండ్లు లభించకపోయినపుడు, శరీరము అనారోగ్యముపాలు అయినపుడు, పంజరములోని చిలుక, శరీరములోని ఆత్మ త మ బందిఖానాలనుండి బయటపడాలి అని తపించిపోతాయి. 
2) అప్పు ఇచ్చువాడు, పుచ్చుకొన్నవాడు మొదటిరోజున బాగానే యుంటారు. పుచ్చుకొన్నవాడు  ఆడబ్బును తిరిగి అప్పు ఇచ్చినవానికి ఇవ్వ్డములో జాప్యము చేసిన సరిగా ఇవ్వకపోయిన గొడవలు ప్రారంభము అయి జీవితాలలో అశాంతి ప్రబలిపోతుంది.  అందుచేత అప్పుజోలికి పోవద్దు.  ఉన్నదానితో సుఖముగా ఉండు.

3) వివాహ బంధము మన శారీరిక , మానసిక దాహాన్ని తీర్చే పవిత్ర బంధము.  నీవు వివాహబంధము అనే సరస్సులో ఒక కలువపూవులాగ జీవించుతు శారీరక మానసిక దాహాన్ని తీర్చుకో.  



(యింకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు )

Friday, June 22, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (11)

0 comments Posted by tyagaraju on 8:23 AM
                                                      
                                           
22.06.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1998 (11)
23.07.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక వృధ్ధ బ్రాహ్మణుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.



నీవు నిత్యము శ్రీసాయి సచ్చరిత్రను  పారాయణ చేస్తున్నావు.  ఆపారాయణ  ఫలాన్ని నీవు ఈవిధముగా పొందుతున్నావు. 

1) నీ కలలలో నీగ జీవితాన్ని, భవిష్యత్ జీవితాన్ని చూడగలుగుతున్నావు.

2) నీయింట జరుగుతున్న శుభకార్యాలకు, జననమరణాల సమయాలలో నేను ఏదో ఒక రూపములో వచ్చి నీకు తోడుగా నిలబడుతున్నాను.
3) నీయింట తిరుగుతున్న సర్వ జీవులలో ఉన్నది నేనే అని గ్రహించగలగుతున్నావు.

4) నీజీవితము అనేక కష్ఠాల కడలిలో పయనించుతున్న సమయములో నీకు ప్రమాదము రాకుండ కాపాడుతున్నాను.   

25.07.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవిత చీకటి దినాలలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నపుడు, నీవు సాయి అనే దీపము వెలుతురులో 



భగవంతుని పాదాలపై భక్తి అనే పుష్పాలను వేయగలిగినావు.
2) భగవంతుని సేవలో వేషము, భాష కలిగిన పండితులు ఉన్నారు.  భగవంతునిపై మూఢ భక్తితో ఉన్న పామరులు ఉన్నారు.  నీవు ఒక పామరుడిలాగ భగవంతుని పూజించు, సేవించు.  
3) ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీవు ఎందరినో కలుస్తావు.  వారితో మాట్లాడుతావు.  కాని, నీవు నీ ప్రయాణము ఒటరిగానే చేయాలి.  నీవు చేరవలసిన గమ్యస్థానము గురించి ఎదురు చూస్తు ఉందాలి.  నీగమ్య స్థానము రాగానే నీవు ఎవరితోను మాట్లాడకుండ దిగిపోవాలి.     

28.07.1998

నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు కీర్తి కండూతితో స్టేజీ ఎక్కి నీగొప్పను నీవు చెప్పుకోవడము శోభస్కరము కాదు.  అదే నీవు మహాత్ముల గురించి స్టేజీ మీద మాట్లాడిన, అది నీజీవితానికి పరిమళము అబ్బినట్లుగా యుంటుంది.    


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  

Thursday, June 21, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (10)

0 comments Posted by tyagaraju on 8:56 AM

                       

21.06.2012  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


సాయి.బా.ని.స. డైరీ - 1998  (10)



15.07.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.





1) సముద్రములో పడవలో ప్రయాణము చేస్తున్నపుడు సముద్రపు అలలలకు పడవకూడ ఊగుతూ ఉంటుంది.  

అటువంటి పరిస్థితిలో ఆందోళన చెదటములో అర్ధము లేదు.  నీవు పడవయొక్క తెరచాపను సరిదిద్దుకొని, చుక్కానిని సరిగా పట్టుకొని ప్రయాణములో ముందుకు సాగిపోవాలి.    
2) నీకు కావలసినవారు అనారోగ్యముతో బాధ పడుతు ఉంటే నీవు వారి బాధను చూడలేవు.  ఒకవేళ చూసిన ఏమి చేయలేవు.  అందుచేత అటువంటి పరిస్థితులకు రాజీపడి జీవించటము ఉత్తమము.  

3) నీవు నేలమీద ప్రయాణము చేస్తున్న, నీటిపైన ప్రయాణము చేస్తున్న, గాలిలో ప్రయాణము చేస్తున్న, నేను సదా నీవెంటనే యుండి నీకు ధైర్యాన్ని ప్రసాదించుతాను.  

4) భగవంతుని అనుగ్రహము అనే మిఠాయిని నీకు ఇవ్వడానికి నాదుకాణము సదా తెరచి యుంటుంది.  నీవు వచ్చి ఆమిఠాయిని తీసుకొని వెళ్ళు. 

16.07.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ఈనాడు కొందరు భగవంతునికన్న మానవుడు రచించిన శాస్త్రాలు, విజ్ఞాన రంగములోని నూతన ఆవిష్కరణలు గొప్పవి అని చెబుతు భగవంతుని ఉనికిని కించపరుచుతున్నారు.  



నీవు అటువంటివారినుండి దూరముగా జీవించు. 

2) ఆధ్యాత్మిక రంగములో ఇద్దరి ఆలోచనలు ఎప్పుడు కలవవు.  ఆధ్యాత్మికము అనేది ప్రతి వ్యక్తి అతని నమ్మకముతో అభివృధ్ధి చేసుకోవాలి.  అంతేగాని తోటివారితో పోల్చుకోరాదు.

3) హిమాలయ పర్వతాలలోని మంచుకు వాతావరణములోని వేడి తగిలిన ఆమంచు నీరుగా మారిపోతుంది.  

అలాగే ఎంతటి గొప్పవ్యక్తికి అయిన అహంకారము రాగానే అతనికి పతనము ప్రారంభము అగుతుంది.  

4) గంగానది పవిత్రమైనది.  ఆనదిలో పడవ ప్రయాణము చేసి ఆఖరికి సాగరములో కలసిపో.  
    

నీప్రయాణము ప్రశాంతముగా సాగిపోవాలి అంటే నీలోని అరిషడ్ వర్గాలను వదిలించుకో.  

20.07.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నేటి రోజున నీవు చేసే మంచి పనులుగాని చెడుపనులు గాని భవిష్యత్ లో గుర్తులుగా మిగిలిపోతాయి. అందుచేత మంచి భవిష్యత్ కోసము ఈరోజున మంచిపనులు చేయి.
2) నీలో పశ్చాత్తాపము కలగగానే నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగిపోతుంది.  అపుడు ఆపాపము నిన్ను ఏమీ చేయలేదు.  కాని, ఆపాపపు చిహ్నాలు సదా అటువంటి పాపాలను చేయవద్దు అని హెచ్చరించుతు ఉంటాయి. 

3) మానసికముగాను , శారీరకముగాను నాసేవ చేసుకొనేవారికి నేను దాసుడిని.  నేను ఎల్లపుడు వారితోనే యుంటాను. 

4) నాతత్వప్రచారము చేస్తు నీవు నీఆఖరి శ్వాస తీసుకొంటావు.  నేను నీశరీరాన్ని పంచభూతాలలో   కలపడానికి కావలసిన ఎండు కట్టెలు సమకూర్చుతాను. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  


Wednesday, June 20, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (09)

0 comments Posted by tyagaraju on 7:00 AM



                                          
                                           
20.06.2012  బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1998  (09)

నిన్నరాత్రి శ్రీ సాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 

1) నీజీవిత ప్రయాణములో నీతోపాటు ప్రయాణము చేస్తున్నవారు బస్సు దిగి తమతమ స్థలాలకు వెళ్ళిపోతున్నారు.  వారు నీకు చెప్పకుండ వెళ్ళిపోయి సుఖశాంతులతో జీవించుతున్నారు.  ఇంకా నీవు వారి గురించి ఆలోచించుతు తలనొప్పి తెచ్చుకోవటములో అర్ధము లేదు. 

2) నీకు జన్మ ఇచ్చిన తల్లితండ్రులలోను, నిన్ను పెంచి పెద్ద చేసిన నీపినతండ్రిలోను, నీకు జీవితములో విద్యా బుధ్ధులు నేర్పిన నీగురువులలోను, నీకు ఉన్న స్నేహితులలోను ఉన్నది నేనే అని సదా గుర్తు చేసుకొంటు యుండు.  

3) నీవు శత్రుత్వ భావముతో కొందరితో మసలుతున్నావు. ఆభావాన్ని వారికి మాత్రమే పరిమితము చేయి.  వారితోనే ఆభావాన్ని అంతము చేయి.  వారి కుటుంబ సభ్యులతో మంచిగా యుండు.   

4) నీవు అవధూతలను గుర్తించటము నేర్చుకో.  అపుడు నీశరీరముపై నీకు వ్యామోహము తొలగిపోతుంది. 
03.07.1998

నిన్న రాత్రి శ్రీసాయి నేను పని చేస్తున్న కర్మాగారములోని వృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 

1) కర్మాగారములో తోటి కార్మికులతో కలసి పని చేసేటప్పుడు నీకంటే వయసులోని చిన్నవారి ఆలోచనలకు, నీకంటే వయసులోని పెద్దవారి ఆలోచనలకు గౌరవాన్ని ఇచ్చి అందరు కలసి పనిని విజయవంతముగా పూర్తి చేయాలి.  అందరికి సంతోషము కలిగించాలి.  
2) ఎంత గొప్పవాడికైన, బీదవానికైన, వృధ్ధాప్యము రాక తప్పదు. అటు వంటి వృధ్ధాప్యములో జీవించటము అంటే అనుక్షణము మృత్యుదేవతను తలచుకొంటు జీవించటము.  మృత్యుదేవత రాకను ఎవరు ఆపలేరు.  అందుచేత సదా భగవంతుని స్మరించుతు మృత్య్యు భయాన్ని విడనాడటము మంచిది కదా.  

3) నీజీవితములో నీవు కష్ఠాలను, సుఖాలను, మంచి, చెడులను చూసినావు.  గురువుపై నమ్మకముతో జీవించుతున్నావు.  నీజీవిత చరిత్రను నీతోటివారికి చెప్పి వారిలో జీవితముపై అవగాహన ఏర్పరుచు.   

11.07.1998

నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 

1) మత్తు పానీయాలు త్రాగేవారు నాకు ఆప్తులు  కాలేరు.  నేను అటువంటివారికి దూరంగా యుంటాను. 
  
2) ప్రాపంచిక రంగములో నీభార్య సలహాలను పాటించుతు గృహస్థ ఆశ్రమములో సుఖసాంతులతో జీవించు.  అదే ఆధ్యాత్మిక రంగములో నీభార్య సలహాను పాటించనవసరములేదు.  నీగురువు సలహాను పాటించుతు నీజీవిత గమ్యాన్ని చేరుకో. 

3) నీ శరీరము ఆరోగ్యముతో యున్నంత కాలము శరీరముపై వ్యామోహము ఉంటుంది.  అలాగే నీదగ్గర విపరీతమైన ధనము యున్నంత కాలము ధనముపై వ్యామోహము, అహంకారము యుంటుంది. 
 ఈమూడు లక్షణాలు ఉన్నంత కాలము నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము కొనసాగించలేవు.  అందుచేత శరీరముపై వ్యామోహము, ధనముపై వ్యామోహము, అహంకారములను విడనాడి భగవంతునిపై దృష్ఠి సారించు.     

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Tuesday, June 19, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (08)

0 comments Posted by tyagaraju on 7:11 AM

                                                  



                             
19.06.2012  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1998 (08)

25.04.1998

శ్రీసాయి నిన్న రాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు

1) నా సంతోషముకోసము నేను పిచ్చుకలను (నాభక్తులను) పట్టి నాజోలిలో వేసుకొని వాటికి అన్నపానీయాలు, రక్షణ ఇచ్చి నేను ఆనందము పొందుతాను. 

 నేను పొందే ఈఅనుభూతిని ఇతరులకు  తెలియచేయడానికి సత్ సంగాలలో నా వాళ్ళు పిచుకల కలను అందరికి తెలియ చేస్తు ఉంటారు.

2) శరీరము అనె గూటిలోని పిచ్చుక యొక్క గూడు పాడైపోయిన, నేను ఆగూటిలోని పిచ్చుకను (ఆత్మను) వేరే గూటిలో చేర్చి దాని ఆలన పాలన చూసుకొంటాను. 

30.04.1998

శ్రీ సాయి నిన్న రాత్రి నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ధన సంపాదన అనేది నీకష్ఠార్జితమునకు సంబంధించినది.  కష్ఠపడకుండ యితరుల ధనాన్ని ఆశించటములో అర్ధము లేదు. కష్ఠపడకుండ ధనము సంపాదించాలి అనే భావన నీలో గూడు కట్టుకొని యున్న దొంగబుధ్ధిని తెలియచేస్తుంది.  

2) నీ కళ్ళకు తగిన కళ్ళజోడు సరసమైన ధరకు లబించిన కొనటము న్యాయము.  ధనము ఖర్చు పెట్టడములో పిసినిగొట్టుతనం చూపించి చవకబారు కళ్ళజోడు కొని 

దానిని ధరించి లేని తలనొప్పిని తెచ్చుకోవటం నీలోని మూర్ఖత్వమునకు నిదర్శనము. 

3) దుకాణములోని పనివాడు సరుకులు అమ్మగా వచ్చిన ధనాన్ని దుకాణము యజమానికి లెక్కలు చూపి అంద చేస్తాడే.  మరి సాయి సత్ సంగాలును నిర్వహించే నీబోటి పనివాళ్ళు, సత్ సంగాలలో వచ్చే గురు దక్షిణలను సాయి సేవలో వినియోగించకుండ స్వంత ఖర్చులకు వినియోగించటాన్ని ఏమి అనాలి అనేది నీవే ఆలోచించు.   

01.05.1998

నిన్న రాత్రి శ్రీసాయి నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 
 
1) ఏపని మొదలుపెట్టిన భగవంతుని నమ్ముకొని మంచి మనసుతో ప్రారంభించిన ఆపని విజయవంతము అగుతుంది. 
2) ఇరుగు పొరుగు వారితో గొడవలు రానివిధముగ మసలటము నేర్చుకో.  అప్పుడే జీవితము ప్రశాంతముగా సాగిపోతుంది.   

3) మత సాంప్రదాయాలకు నేను అతీతుడిని అని చెప్పుకొంటు గొప్పలకు పోవద్దు.  యితరమతస్థులు ఎదురు పడినప్పుడు వారి మత సాంప్రదాయాలలో తలదూర్చకుండ వారికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇచ్చిననాడు నీకు మనస్ప్రర్ధలు రావు. 

4) నీజీవితములో భవిష్యత్ లో ఏదో చేయాలి అని కలలు కనేకన్న, వర్తమానములో మంచిపనులు చేస్తు ప్రశాంతముగా జీవించటము నేర్చుకో.   
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Monday, June 18, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (07)

0 comments Posted by tyagaraju on 8:07 AM





                                 




సాయి.బా.ని.స. డైరీ - 1998 (07)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


02.04.1998


నిన్న రాత్రి శ్రీసాయి నాచిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.


1) నేడు విద్యాలయాలలో పరీక్షా అధికారులు తమ బాధ్యతలను విస్మరించి ధన సంపాదన కోసము అమ్ముడుపోయి విద్యాప్రమాణాలను దిగజార్చుతున్నారు.   





2) ధన సంపాదన కోసము పురుషులు స్త్రీలను హీనాతి హీనముగా వాడుకొనుచున్నారు.  ఈనాడు సమాజము స్త్రీకి ఇవ్వవలసిన కనీస గౌరవము వారికి ఇవ్వడములేదు.  నీవు అటువంటివారినుండి దూరముగా జీవించు.  


3) ధన సంపాదన విషయములో బురదలో కాలు వేసినపుడు ఆధన సంపాదన సంగతి భగవంతుడికి తెలుసు.  కాని, ఆబురద సంగతి నీచుట్టుప్రక్కలవారికి తెలుస్తుంది. నీజీవితములో అశాంతిని ప్రసాదించుతుంది.  


04.04.1998


శ్రీసాయి నిన్నరాత్రి నేను చదివిన కాలేజీలోని లెక్చరర్ రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.


1) నీవు ఉద్యోగములో యుండగా అహంకారముతో జీవించగలవు.  మంది మార్బలముతో సుఖజీవితాన్ని పొందగలవు.  కాని, నీవు ఉద్యోగమునుండి విరమణ చేసిన తర్వాత మంది మార్బలము యుండదు.  కాని, ఇంకా అహంకారము మిగిలి యుంటుంది.  అదే అహంకారము నీవారిని నీనుండి దూరము చేస్తుంది.  ఆఖరికి నీవు హీనాతిహీనంగా నీజీవిత ఆఖరి దశ గడిపి ఈలోకమునుండి  నిష్క్రమించుతావు.   


2) ఎదుటివానిలో మిరపకాయల గుణములు ఉన్నాయి అని తెలిసికూడ, నీవు మంచితనము అనే పాలును అతనికి పోసిన ఆపాలు మట్టిలో  పోసిన పాలుతో సమానము.  



అందుచేత నీవు నీలోని మంచితనాన్ని అర్హత ఉన్నవారికి మాత్రమే పంచిపెట్టు.  దుష్ఠులకు ఎల్లపుడు దూరంగా జీవించు.  


07.04.1998


నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.


1) చీకటిలో బయటకు వెళ్ళి ప్రమాదాలు కొనితెచ్చుకొనేకన్నా నీజీవితములోని చీకటిని తొలగించమని రాత్రివేళలో ఆభగవంతుని ధ్యానించటము మేలు కదా.   



2) నీవు పదిమంది దగ్గరకు వెళ్ళి కరచాలనము చేసి అందరి దృష్ఠిలో పడటముకన్నా, నీదగ్గరకు వచ్చినవారితో నీవు కరచాలనము చేస్తు వారి ప్రేమను నీవు పొందగలగటము మిన్న.  

3) ఇతర గురువులు మంచినీతి వాక్యాలను చెప్పిన వినటములో తప్పులేదు.  నీకు కావలసిన మంచి,  నీగురువు ఒక్కడికే తెలుసును కాబట్టి నీగురువు నిన్ను నడిపించే మంచి మార్గములో పయనించుతూ జీవితములో మంచిని అనుభవించు.  


4) జీవిత ప్రయాణములో నీకు ప్రశాంతత కలిగించేది విష్ణుసహస్ర నామము, మరియు ఓంకార స్మరణ.  
వాటిని సదా ఉచ్చరించుతు ఉండు.  


(ఇంకా ఉంది) 
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List