సాయి.బా.ని.స. డైరీ -  1998  (09)
నిన్నరాత్రి శ్రీ సాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 
1) నీజీవిత ప్రయాణములో నీతోపాటు ప్రయాణము చేస్తున్నవారు బస్సు దిగి తమతమ స్థలాలకు వెళ్ళిపోతున్నారు.  వారు నీకు చెప్పకుండ వెళ్ళిపోయి సుఖశాంతులతో జీవించుతున్నారు.  ఇంకా నీవు వారి గురించి ఆలోచించుతు తలనొప్పి తెచ్చుకోవటములో అర్ధము లేదు. 
2) నీకు జన్మ ఇచ్చిన తల్లితండ్రులలోను, నిన్ను పెంచి పెద్ద చేసిన నీపినతండ్రిలోను, నీకు జీవితములో విద్యా బుధ్ధులు నేర్పిన నీగురువులలోను, నీకు ఉన్న స్నేహితులలోను ఉన్నది నేనే అని సదా గుర్తు చేసుకొంటు యుండు.  
3) నీవు శత్రుత్వ భావముతో కొందరితో మసలుతున్నావు. ఆభావాన్ని వారికి మాత్రమే పరిమితము చేయి.  వారితోనే ఆభావాన్ని అంతము చేయి.  వారి కుటుంబ సభ్యులతో మంచిగా యుండు.   
4) నీవు అవధూతలను గుర్తించటము నేర్చుకో.  అపుడు నీశరీరముపై నీకు వ్యామోహము తొలగిపోతుంది. 
03.07.1998
నిన్న రాత్రి శ్రీసాయి నేను పని చేస్తున్న కర్మాగారములోని వృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 
1) కర్మాగారములో తోటి కార్మికులతో కలసి పని చేసేటప్పుడు నీకంటే వయసులోని చిన్నవారి ఆలోచనలకు, నీకంటే వయసులోని పెద్దవారి ఆలోచనలకు గౌరవాన్ని ఇచ్చి అందరు కలసి పనిని విజయవంతముగా పూర్తి చేయాలి.  అందరికి సంతోషము కలిగించాలి.  
2) ఎంత గొప్పవాడికైన, బీదవానికైన, వృధ్ధాప్యము రాక తప్పదు. అటు వంటి వృధ్ధాప్యములో జీవించటము అంటే అనుక్షణము మృత్యుదేవతను తలచుకొంటు జీవించటము.  మృత్యుదేవత రాకను ఎవరు ఆపలేరు.  అందుచేత సదా భగవంతుని స్మరించుతు మృత్య్యు భయాన్ని విడనాడటము మంచిది కదా.  
3) నీజీవితములో నీవు కష్ఠాలను, సుఖాలను, మంచి, చెడులను చూసినావు.  గురువుపై నమ్మకముతో జీవించుతున్నావు.  నీజీవిత చరిత్రను నీతోటివారికి చెప్పి వారిలో జీవితముపై అవగాహన ఏర్పరుచు.   
11.07.1998
నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 
1) మత్తు పానీయాలు త్రాగేవారు నాకు ఆప్తులు  కాలేరు.  నేను అటువంటివారికి దూరంగా యుంటాను. 
2) ప్రాపంచిక రంగములో నీభార్య సలహాలను పాటించుతు గృహస్థ ఆశ్రమములో సుఖసాంతులతో జీవించు.  అదే ఆధ్యాత్మిక రంగములో నీభార్య సలహాను పాటించనవసరములేదు.  నీగురువు సలహాను పాటించుతు నీజీవిత గమ్యాన్ని చేరుకో. 
3) నీ శరీరము ఆరోగ్యముతో యున్నంత కాలము శరీరముపై వ్యామోహము ఉంటుంది.  అలాగే నీదగ్గర విపరీతమైన ధనము యున్నంత కాలము ధనముపై వ్యామోహము, అహంకారము యుంటుంది. 
 ఈమూడు లక్షణాలు ఉన్నంత కాలము నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము కొనసాగించలేవు.  అందుచేత శరీరముపై వ్యామోహము, ధనముపై వ్యామోహము, అహంకారములను విడనాడి భగవంతునిపై దృష్ఠి సారించు.     
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 










0 comments:
Post a Comment