19.06.2018 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు బాబా వారి మరొక అధ్బుతమయిన లీలలగురించి తెలుసుకుందాము. మానవునికి కష్టాలు ఎదురయినపుడే భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు ప్రతి దేవుడికి అనేక మొక్కుకు మొక్కుకుంటాడు. అవసరం మానవుడిని భగవంతుడిని ప్రార్ధించేలా చేస్తుంది. ఇక కష్టాలు తీరిపోగానే భగవంతుడిని మర్చిపోతాడు. ఆవిధంగా కాకుండా నిరంతరం మనం భగవంతుడిని స్మరించుకుంటూనే ఉండాలి. బాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ రోజు మీరు చదవబోయేది. సాయిలీలా.ఆర్గ్ నుండి సేకరించబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా (అమెరికా)
1 571 594 7354
శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి
సహాయం చేస్తున్నారా? 1 వ.భాగమ్
దేశంలో
ఎంతోమందికి ఉత్పన్నమయే పైన ఉదహరించిన ప్రశ్నకు, జిజ్ఞాసతో మరెన్నిటినో అడిగేవాటికి
సంతృప్తికరమయిన సమాధానాలు సాయిబాబా తెలియచేస్తూ ఉంటారు. ఆ ప్రశ్న సామాన్యంగా ఏదో కుతూహలంతో తెలుసుకోవడానికి
వేసిన ప్రశ్న కాదు. అవసరాన్ని బట్టి ఆ ప్రశ్న
ఉదయిస్తూ ఉంటుంది. కష్టాలనెదుర్కొనేవాళ్ళు
వేలమంది ఉంటూ ఉంటారు. అటువంటి సమయంలో తమ కష్టాలను
రూపుమాపి తమను ఆదుకునేవారు ఎవరున్నారా అని నలుదిశలా దృష్టి సారిస్తూఉంటారు. ఆదుకోవడానికి భగవంతుడు లేడా? సాధుపుంగవులు లేరా, ఏదయినా మంత్రం ఉందా, న కష్టాలు తీరడానికి మరేదయినా మార్గం ఉందా అని ఈ విధంగా
కష్టాలలో ఉన్నవారు ఆర్తితో విలపిస్తూ ఉంటారు.
అటువంటి కష్టసమయాలలో నేటికీ సజీవంగా ఉండి సహాయపడేది ఒక్క సాయిబాబాయే అనే ధృఢనిశ్చయంతో,
సాయిబాబాతో అనుబంధాన్ని పెచుకున్న వ్యక్తి దగ్గరకు, లేక తన పొరుగున ఎవరయినా ఉన్నట్లయితే
వారి వద్దకు గాని సాయిబాబా సహాయానికై పరుగు తీస్తాడు. అందువల్ల ప్రజలందరికీ వారి వారి భాషలలో గాని, ఆంగ్లంలో
గాని హిందీలో గాని చాలా వివరంగా బాబా ఇప్పటికీ సజీవంగానే ఉండి తన విలక్షణమయిన రీతిలో
సహాయపడగల వ్యక్తి ఆయన తప్ప, మనకు తెలుసున్నవారిలో మరెవరూ లేరనే విషయాన్ని తెలియచేయవలసిన
ఆవశ్యకత ఎంతయినా ఉంది.