Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 29, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 44వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 8:08 AM

 



29.10.2022  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 44వ, భాగమ్

అధ్యాయమ్ – 42


మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి


తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

సాయి నన్ను భక్తునిగా స్వీకరించారు

హరిహరానంద్ మహరాజ్ (అన్నా మహరాజ్ సొలైకర్) అనే భారతీయ యోగి మహుర్గడ్ లోని రేణుకామాత భక్తులు.  ఆయన డ్యూల్గవ్రజ వస్తూ ఉంటారు.  ఆయనకు అక్కడ చాలామంది శిష్యులున్నారు.  నేనెప్పుడూ అన్నామహరాజ్ గారిని వ్యక్తిగతంగా కలుసుకోలేదు.  “అన్నా మహరాజ్ గారు మా పవిత్రమయిన భవనంలోకి వచ్చినట్లు, కొంతసేపటికి ఆయన మా భవనం మధ్యలో కూర్చుని నన్ను తనకి సేవ చేసుకోమన్నట్లు” ఈ విధంగా నాకు ప్రేరణ కలుగుతూ ఉండేది.

Monday, October 24, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్ (2)

0 comments Posted by tyagaraju on 5:33 AM

 




24.10.2022 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

దీపావళి శుభాకాంక్షలు


శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్ (2)

అధ్యాయమ్ – 41 (2)

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

సముద్రాలు దాటుకుని రా బాబా! - 2

(నిన్నటి భాగమ్ తరువాయి)

నాలుగయిదు రోజుల దాకా అంతా సవ్యంగానే జరిగింది.  అకస్మాత్తుగా లాప్రోస్కోపీ జరిగిన చోట చీము రావడం మొదలయింది.  విదేశాల్లో మనకి చిన్న క్లినిక్ లు కొద్దిపాటి దూరాలలో ఏమీ ఉండవు.  అరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా నేషనల్ హెల్త్ సర్వీసెస్ కి వెళ్లవలసిందే.  అక్కడికి అమ్మాయిని తీసుకువెళ్ళాను.  అక్కడి వైద్యుడు పుండు ఉన్న చోట నొక్కాడు.  అంతే ఇక చీము ఆగకుండా రావడం మొదలయింది.  నాకు చాలా భయం వేసింది.  కాని అంతకన్న మార్గం ఏమీ లేదు.  

Sunday, October 23, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:09 AM

 



23.10.2022 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్

అధ్యాయమ్ – 41

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

సముద్రాలు దాటుకుని రా బాబా!

2005 వ.సం.  మా అమ్మాయికి నాటింగ్ఫ్ హాం యూనివర్సిటీలో ఎం ఎస్ లో ప్రవేశం లబించింది.  ఎం.ఎస్. పూర్తయిన తరువాత లీడ్స్ లో ఉద్యోగం వచ్చింది.  నలుగురైదుగురు స్నేహితురాళ్ళతో కలిసి ఒక ఫ్లాట్ లో ఉంటోంది.  వాళ్ళందరూ ఆ ఫ్లాట్ లో ఎలా ఉంటున్నారో ప్రతిరోజు వారి దినచర్యలేమిటో చూద్దామని నేను వెళ్లాను.  కాన్వొకేషన్ కార్యక్రమానికి కూడా వెళ్ళాను.  భారతదేశానికి తిరిగి వచ్చాక కూడా మా అమ్మాయితో అంతర్జాలంలో ద్వారా మాట్లాడుతూ ఉండేదానిని.  అక్కడ అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List