16.04.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్
మామిడిపళ్ళు
– బాబా అనుగ్రహమ్
ఈ
రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన మరొక సాయి వైభవం గమనిద్దాము.
హరిశ్చంద్ర
పితలే కుమారుడికి మూర్చవ్యాధి ఏవిధంగా నివారణయిందో దాని గురించి శ్రీ సాయి సత్ చరిత్ర
26వ. అధ్యాయంలో వివరింపబడింది. బాబా హరిశ్చంద్రతో
“బాపూ! ఇంతకు ముందు నీకు రెండు రూపాయలిచ్చాను.
ఈ మూడు రూపాయలు కూడా ఉంచుకుని వాటితోపాటుగా ప్రతిరోజు భక్తితో పూజించుకో. అది నీకు ఎంతో మేలు చేస్తుంది” అని ఆశీర్వదించారు. హరిశ్చంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి షిరిడీకి వెళ్ళడం అదే మొదటిసారి. మరి బాబా తనకు ఇంతకు ముందు రెండు రూపాయలనిచ్చానని చెప్పారు? ఆయన మాటలు అర్ధం కాలేదు. జరిగినదంతా తన తల్లికి చెప్పాడు . అప్పుడామె “నాయనా, నీ తండ్రికి స్వామి సమర్ధ రెడు రూపాయలనిచ్చారు” అని బాబా అన్న మాటలలోని అర్ధాన్ని వివరించింది.
కుటుంబ సభ్యులందరూ అతను తన షిరిడీ యాత్ర విశేషాలను చెబుతుంటే చాలా ఆసక్తిగా విన్నారు. అతని సోదరుడయిన విష్ణు పంత్ బల్వంత్ కూడా ఆ విశేషాలన్ని విన్నాడు.