13.04.2016  బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావాఅరి శుభాశీస్సులు
ఈ
రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన జీవిత సందేశాలనుండి కొన్ని సందేశాలు తెలుసుకుందాము.
శ్రీసాయి
పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్
31.07.2001
11) మన ఇంటిలో ఈగల
బాధ ఉన్నట్లే, అదే విధంగా
 ప్రాపంచిక
జీవితంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను అసూయాపరుల నుండి బాధలు ఉంటాయి.  అవి క్షణికమయినవి. 
ఆ బాధలను మనం ఓరిమితో భరిస్తూ
జీవిత పాఠాలు నేర్చుకోవాలి. 
31.08.2001
12) తన పిల్లల
పోషణ కొరకు కన్నతల్లి ఎన్ని కష్టాలు పడుతుంది
అన్నది మీరు కళ్ళారా చూశారు.  మరి
నేను నా పిల్లల పోషణ కొరకు ఎన్ని
కష్టాలు పడుతున్నాను అన్నది ఆ భగవంతుడు మాత్రమే
చూడగలడు. 
12.10.2001
13) తన ప్రాణ
రక్షణ అనేది ప్రతి జీవికి భగవంతుడిచ్చిన
వరం.  తన
ప్రాణ రక్షణ కోసం ఎదుటి
జీవిని చంపడం పాపం కాదు.
16.10.2001
14).  లాటరీలో
బహుమతి అందరికీ రాదు.  ఏనాడో
ఒకనాడు బహుమతి వస్తుంది అనే ఆశతో జీవించాలి.  ఆశ
మనిషి బ్రతకడానికి కావలసిన శక్తినిస్తుంది.  ఆశక్తితోనే
ఎన్ని చికాకులు వచ్చినా వాటిని జయించగలము. 
15)  మధ్యతగతి
కుటుంబంలో అసంతృప్తి కలగటం సహజము.  ఆ అసంతృప్తిని దూరం
చేసుకోవటానికే సాయి కధలు చదవాలి,
వినాలి.
16)  ఈనాటి
కష్టము రేపటి రోజున సుఖానికి
మొదటి మెట్టు, అని గ్రహించి నిజ
జీవితంలో పయనించు. 
17)  జీవితంలో
భగవంతునిపై శ్రధ్ధ మరియు వారి అనుగ్రహం
కోసం సబూరి కలిగి ఉండమని
నేను అనేకసార్లు చెప్పాను.  కాని
నేటి మానవులు భగవంతునిపై శ్రధ్ధను చూపుతూ వాని అనుగ్రహం పొందటంలో
సబూరీని (ఓరిమి) మరచి జీవితాన్ని నాశనము
చేసుకుంటున్నారు.  మరి
దీనికి బాధ్యులు ఎవరు అని ఆలోచించుకోవాలి.
31.10.2001 
18)  నీ
గత జీవిత అనుభవాలు, జ్ఞాపకాలు, నేటి నీ జీవిత
ప్రయాణానికి ఆఖరి మైలురాయి మరియు
నీ నూతన జీవిత ప్రారంభానికి
మొదటి మైలు రాయి అని
గుర్తించి జీవించు.
19)  నీ తోటి
మానవులలో కొందరిని నీవు అంటరానివాడని భావించి
వారిని అన్ని రంగాలలోను దూరంగా
ఉంచుతున్నావే, మరి నీప్రాణ రక్షణకోసము
నీవు వారి రక్తాన్ని దానంగా
స్వీకరించుతున్నపుడు వారిని నీవు అంటరానివారు అని
అనడంలో అర్ధం లేదు.
22.10.2001
20) ఒక చెట్టుకాయను
పరిపక్వము కానీయకుండానే నీవు కోసుకొని తింటున్నావే.  అపుడా
చెట్టు నిన్ను దూషించలేదే.  భగవంతుడు
అల్పాయుష్షుతో జన్మించిన నీబిడ్డను తీసుకుంటే నీవు ఆభగవంతుని దూషించవచ్చునా
ఒక్కసారి ఆలోచించు.  
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు) 









0 comments:
Post a Comment