16.01.2017
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
భక్తుల అనుభవాలు
సునీత గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా – 2వ.భాగమ్
నవంబర్
8 వ తేది ఉదయం సాయి
టెంపుల్ కి వెళ్లి అక్కడి
నుండి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను.
అందరు భయపడ్డారు. ఈ పిల్ల చెపితే
వినలేదు, రెస్ట్ తీసుకోలేదు ఏమౌతుందో అని అందరికి ఒకటే
భయం. అప్పుడు బాబా చూపించారు అద్భుతం.
5kg ల బరువుతో చక్కని బాబు పుట్టాడు. అందరు
ఆశ్చర్యపోయారు. భలే పుట్టాడని అందరు
ఆనందించారు. చూసారా బాబా నాకు ఎంత
పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబు కి సాయి
పుష్కర్ అని పేరు పెట్టాము,