27.08.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 13
121. నిజ జీవిత ప్రయాణము నీవాళ్ళతో కలసి సాగించే రైలు ప్రయాణము
వంటిది. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము
ఏకాకిగా నింగి నేల కలిసే చోటుకు
చేరుకోవాలనె తపనతో సాగించే ప్రయాణమువంటిది.
- 28.03.94
122. గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము ఈజన్మలో మనము
అనుభవించుతున్నాము అని తలచటము ఆధ్యాత్మిక రంగ ప్రవేశ ద్వారము. తోటిమానవుడు చనిపోయినపుడు అతని శరీరానికి అంతిమ
సంస్కారాలు జరుగుతున్న సమయములో మనము శరీర సుఖాలగురించి ఆలోచించటము ఆధ్యాత్మిక రంగ
నిష్క్రమణ ద్వారము.
- 30.04.94
123. నాపేరిట గారడీ విద్యలు చేసి చూపించి పొట్ట నింపుకొనే
స్వాములువారి దగ్గరకు వెళ్ళటము నీతప్పు.
అంతేగాని ఆస్వాములువారి తప్పు మాత్రము కాదు.
- 15.05.94
124. ధన సంపాదన విషయములో పరుగులు పెట్టరాదు. ఆపరుగులు నీజీవితానికి మెరుగులు పెట్టేబదులు
ఆశాంతిని కలిగించుతుంది.
- 11.06.94
125. తగాదాలు, గొడవలు
పడవద్దు. పగవైషమ్యాలు పెంచుకోవద్దు. వీలు అయితే నీశత్రువులను క్షమించు. లేదా వాళ్ళనుండి దూరంగా ఉండు.
- 12.06.94
126. నీకు సహాయము చేసినవారిని నీవు మరచిపోతున్నావే. మరి నీకు
అపకారము చేసినవారిని గుర్తు పెట్టుకోవటములో అర్ధము లేదు.
- 24.06.94
127. నాకు నైవేద్యముగా ధనముతో కొన్న బత్తాయి ఫలాలుకంటే
చెట్టునుండి రాలిపడిన తాటిపండును సమర్పించితే నేను చాలా సంతోషించుతాను.
- 11.08.94
128. జంతువు ప్రాణముతో ఉన్నా లేకపోయినా మానవుడికి
ఉపయోగపడుతుంది. మానవుడు చనిపోయిన తర్వాత
ఎలాగు ఎవరికి ఉపయోగపడడు. అందుచేత మానవుడు
బ్రతికి యుండగానే తోటిమానవునికి ఉపయోగపడాలి.
- 02.09.94
129. నాపూజకు మడిబట్టలు, తడిబట్టలు ధరించనవసరములేదు. శుచి,
శుభ్రతయుంటే చాలు. కొబ్బరిబొండాలు నాకు నైవేద్యముగా పెట్టిన
చాలు. నీయింటికి ప్రసాదము స్వీకరించడానికి
వచ్చినవారిలో నన్ను చూసుకొని వారితో ఆప్యాయముగా మాట్లాడినా అదే నాకు నీవు అర్పించే
భక్తితో కూడిన పూజ.
- 07.09.94
130. నిలుటద్దములో ఒకసారి నన్ను చూడు. నానిజస్వరూపము నీకు చూపిస్తాను. నీవైపు కన్ను ఆర్పకుండ చూస్తాను.
- 13.09.94
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు