13.08.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(7)
మానవజన్మ (1వ.భాగమ్)
హిందూ
శాస్త్రముల ప్రకారం ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. (20 లక్షలు చెట్లు, మొక్కలు,
9 లక్షలు జలచరాలు, 11 లక్షలు క్రిమికీటకాలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు జంతుజాలాలు,
4 లక్షల మానవజాతి). ఈ ఆత్మలన్నీ కూడా పూర్వజన్మలో
అవి చేసుకున్న కర్మలను బట్టి, వివిధ రకాల జన్మలలో తిరిగి జన్మిస్తూ ఉంటాయి. ఏమయినప్పటికీ పాపపుణ్యాలు రెండూ సమానంగా ఉన్న అవకాశం
ఏర్పడినప్పుడు ఆత్మలకి మానవ జన్మ పొంది తద్వారా మోక్షాన్ని పొందే అవకాశం ఇవ్వబడుతుంది.