Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 20, 2021

బహ్రైన్ లో ఊదీ అధ్బుతమ్

1 comments Posted by tyagaraju on 9:12 AM

 



20.05.2021  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక మే – జూన్, 2011 వ.సం. సంచికలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన ఊదీ యొక్క మహిమను ఈ రోజు ప్రచురిస్తున్నాను.

బహ్రైన్ లో ఊదీ అధ్బుతమ్

సాయిబాబా తన ప్రేమను అనేకవిధాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు.

అటువంటి అనుభవాలెన్నో జరిగినవాటిలో నా హృదయానికి అమితంగా ఆకట్టుకున్న అధ్భుతమయిన లీలని ఈ రోజు వివరిస్తాను.

2005వ.సం.లో నా భర్తకు సర్జరీ జరిగిన తరువాత జీవితం ఎప్పటిలాగా సాగలేదు.  నా భర్తకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది.  భగవంతుని దయవల్ల ఆట్యూమర్ ని తీసివేసారు.  కాని మా జీవితాలు మాత్రం ఒడిదుడుకులకు లోనయింది.  నా భర్త ఇక జీవితాంతం స్టెరాయిడ్స్ మీద, హార్మోన్ ఇంజక్షన్ ల మీద ఆధారపడి జీవించాల్సిందేనని వైద్యులు చెప్పారు.

ప్రతిరోజు భగవంతుడు జీవితాన్ని ప్రసాదించిన రోజుగా ఎన్నోరోజులు భావిస్తూ వచ్చాము.

Tuesday, May 18, 2021

సమాధి మందిరాన్ని చూడాలనే కోరిక – అధ్భుతమయిన లీల

0 comments Posted by tyagaraju on 6:19 AM

 


18.05.2021  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సమాధి మందిరాన్ని చూడాలనే కోరిక – అధ్భుతమయిన లీల

సాయిలీల ద్వైమాసపత్రిక మే – జూన్, 2011 వ. సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన బాబా లీల ఈ రోజు ప్రచురిస్తున్నాను. 

బాబాని మనం మనఃస్ఫూర్తిగా వేడుకోవాలే గాని ఆయన మన విన్నపాన్ని మన్నించి మన కోరికను తీర్చకుండా ఉంటారా?  కాని మనం కోరుకునే కోరికలు కూడా సహేతుకమయినవే అయిఉండాలి తప్ప మన స్వార్ధం కోసం కోరుకునేవిగా ఉండకూడదు.  మనకేది మంచిదో బాబాకు తెలియవా?  ఇక ఈ అధ్భుతమయిన లీల చదవండి.

బాబా ఎంతో అందమయిన లామినేషన్ చిత్రరూపంలో విచిత్రంగా నావద్దకు ఏవిధంగా వచ్చారో, బాబా దీవెనలతో మీ కందరికీ వివరిస్తాను.

మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2004వ.సం. లో నేను అమెరికాకు వచ్చాను.  నా దగ్గర ఉన్న బాబా ఫోటోకి నేను ప్రతిరోజు సాయంత్రం ఆరతి ఇస్తూ ఉంటాను.  నా దగ్గర ఉన్న ఫొటోలో బాబా పూర్తిగా నిండయిన విగ్రహ రుపంలో లేరు.  మోకాళ్ళవరకు మాత్రమే ఉంది. 

Sunday, May 16, 2021

పారిపోయిన గుఱ్ఱమ్

0 comments Posted by tyagaraju on 8:15 AM

 




16.05.2021  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.  శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా, చాంద్ పాటిల్ యొక్క తప్పిపోయిన గుఱ్ఱాన్ని ఏవిధంగా ఎక్కడ ఉందో చూపించారో మనకందరకూ తెలుసు.  అదే విధంగా ఒక నాస్తికుడికి కూడా అతని గుఱ్ఱాన్ని చూపించిన అద్భుత సంఘటన ఇది.  శ్రీ సాయిలీల ద్వై మాసపత్రిక మే – జూన్, 2011 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

పారిపోయిన గుఱ్ఱమ్

చిన్నప్పటినుండి నేను నాస్తికుడిని.  భగవంతుడిని నమ్మడం కాని, పూజించడం గాని ఇవేమీ నాకు అవసరం అనిపించలేదు. నా  నాస్తికత్వం, నా ఆలోచనా విధానాలే నా జీవితంలో నేను సాధించిన అభివృధ్ధికి కారణమనే నా అభిప్రాయం.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List