29.10.2022
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 44వ, భాగమ్
అధ్యాయమ్ – 42
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
సాయి
నన్ను భక్తునిగా స్వీకరించారు
హరిహరానంద్
మహరాజ్ (అన్నా మహరాజ్ సొలైకర్) అనే భారతీయ యోగి మహుర్గడ్ లోని రేణుకామాత భక్తులు. ఆయన డ్యూల్గవ్రజ వస్తూ ఉంటారు. ఆయనకు అక్కడ చాలామంది శిష్యులున్నారు. నేనెప్పుడూ అన్నామహరాజ్ గారిని వ్యక్తిగతంగా కలుసుకోలేదు. “అన్నా మహరాజ్ గారు మా పవిత్రమయిన భవనంలోకి వచ్చినట్లు,
కొంతసేపటికి ఆయన మా భవనం మధ్యలో కూర్చుని నన్ను తనకి సేవ చేసుకోమన్నట్లు” ఈ విధంగా
నాకు ప్రేరణ కలుగుతూ ఉండేది.
(మాహుర్ ఘడ్ రేణుకా దేవి)
ఇలా
నాకు ఎన్నోసార్లు ఆవిధంగా చేయమన్నట్లుగా భావాలు కలుగుతూ ఉండేవి. అందువల్ల నేను అన్నామహరాజ్ గారికి ముఖ్య శిష్యుడు
ఒకరికి ఈ విషయం చెప్పాను. అతను నన్ను అన్నామహరాజ్
దగ్గరకి తీసుకువెళ్ళాడు. ఆయన తనతో మాట్లాడటానికి
నాకు చాలా సమయం కేటాయించారు. నేను చెప్పినదంతా
ఆయన మౌనంగా విన్నారు. అంతా విన్న తర్వాత ఆయన
భవిష్యత్తులో మా ఇంటికి వచ్చి మాకందరికీ రేణుకామాత దీవెనలు ఇచ్చి ఆశీర్వదిస్తానని అన్నారు. అప్పట్లో మానాన్నగారు మరణించడం వల్ల నేను చాలా విచారంలో
మునిగి ఉన్నాను.
నాలుగయిదు
సంవత్సరాల తరువాత నాకు అన్నామహరాజ్ గారినుంచి మంచి సలహా తీసుకోవాలనిపించింది. ఆకారణంగా ఒక రోజును నిర్ణయించుకుని ఆరోజున ఆయనను మా
యింటికి ఆహ్వానించుదామనుకున్నాను.
ఆయనను
ఇంటికి ఆహ్వానించి సలహాతీసుకోవడానికి ఇక వారం రోజులు మాత్రమే ఉంది. ఒకరోజు వేకువజామునే నాకొక స్వప్నం వచ్చింది. ఆస్వప్నంలో “నేను అన్నామహరాజ్ గారిని ఇంటికి ఆహ్వానించడానికి
అన్ని ఏర్పాట్లు చేసాను. అన్నామహరాజ్ గారు
ఒక చతురస్రపు బల్ల మీద కూర్చుని ఉన్నారు. నేను
ఆయనకు పూజ చేస్తున్నాను. మా ఇద్దరు చెల్లెళ్ళు
నా ప్రక్కనే కూర్చున్నారు. అన్నాగారిని పూజించడం
పూర్తయింది. ఆయన మెడలో పూలదండను వేసాను. నేను అన్నాగారి పాదాల మీద నా శిరస్సునుంచాను. ఆక్షణంలో అన్నాగారి పాదాలు తోసివేయబడ్డాయి. వాటి స్థానంలో సాయిబాబా గారి పాదాలు కనిపించాయి. నా శిరస్సు సాయిబాబాగారి చరణాల మీద ఉంది. నేను లేచి పైకి చూసినపుడు బల్ల మీద అన్నామహరాజ్
గారు లేరు ఆయన స్థానంలో సాయిబాబా ఉన్నారు.
ఈ స్వప్న
సందేశాన్ని బట్టి సాయిబాబా తన వద్దనుంచి తప్ప మరెవరినుంచీ సలహాలు పొందవద్దని అన్నట్లుగా
నేను గ్రహించుకున్నాను.
అప్పటినుండి
సాయిబాబానే నా గురువుగా భావించాను. బాబా నన్ను
తన భక్తునిగా స్వీకరించినందుకు నేనెంతో అదృష్టవంతుడిని.
ఉదయ్
బక్షి
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment