01.03.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
8 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా
ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే
ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
నాడీ జాతకం వివరాలు – శ్రీ
సెంధిల్ కుమార్, నాడీ రీడర్ తేదీ : 27.05.2006
(తరువాయి భాగమ్)
(నాడీ రీడర్ అని వ్రాసి ఉన్న చోట
ఆ వివరాలు నాడీ జ్యోతిష్కుడు తాళపత్రాలలో ఉన్నదానిని చదువుతున్నాడని, దాని క్రింద ఇటాలిక్స్ లో
ఇచ్చినవి లోరైన్ గారి వ్యాఖ్యానమని పాఠకులు గ్రహించాలి.
త్యాగరాజు)
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
నాడీ రీడర్ - ఈ జన్మలో నువ్వు షిరిడీ బాబాయే నీ శ్వాసగా జీవిస్తావు. భవిష్యత్తులో నువ్వు ఆయన
సందేశాలను ముందు తరం వారికందరికీ ప్రచారం చేస్తావు.
బాబా తన ఇష్ట ప్రకారం నన్ను
ఆ విధంగా ఉపయోగించుకుంటే నేను చాలా ఆనందిస్తాను.