08.12.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత రెండురోజులుగా అనువాద ప్రక్రియ సాగుటు ఉండటంవల్ల, ఆఫీసు పనుల వల్ల ప్రచురించడానికి వీలు చిక్కలేదు. సాయితో మధుర క్షణాలు కూడా తయారు చేస్తూ ఉన్నాను. ఎదురు చూస్తూ ఉండండి.
ఈరోజు తిరిగి సాయి.బా.ని.స. చెప్పే జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 5వ. భాగం వినండి.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 15వ. శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దం ష్ట్రః చతుర్భుజః ||
పరమాత్మను లోకములకు అధ్యక్షునిగను, దేవతలకు అధిపతిగను, ధర్మమునకు నిర్వాహకునిగను, సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగాను, నాలుగు స్థితులుగా వ్యక్తమగువానిగను, నాలుగు వ్యూహములుగా తెలియబడువానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు భుజములు గలవానిగను ధ్యానము చేయుము.