03.01.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ
సాయి జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు
బాబాకు మనము
ఏమి సమర్పించాలి
( శ్రీ రాధాకృష్ణ
స్వామీజీ)
(సాయి పదానంద
జనవరి, 2003, సంచిక సాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడినది)
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దాదాపు
నెలరోజులు పైగా అయింది మన బ్లాగులో ప్రచురించి. నా కంప్యూటర్ మరియు లాప్ టాప్ లు రెండు ఒకేసారి
పాడయిన కారణంగా ప్రచురింపలేకపోయాను. ఈ రోజు
మన సాయి భక్తులందరికీ బాబాకు మనము సమర్పించవలసినవి ఏమిటి, ఆయన భక్తులుగా మనం చేయవలసినదేమిటి
అనే విషయాల మీద శ్రీ రాధాకృ ష్ణస్వామిగారి వ్యాసాన్ని ప్రచురిస్తున్నాను. చదివిన తరువాత మీ అభిప్రాయములను తెలపండి.
బాబా
మాత్రమే కల్పతరువుగా తన భక్తుల కోరికలను తీర్చగలడని, అటువంటి బాబాకు మనం తిరిగి ఏమీ
ఇవ్వనక్కరలేదనే భావం మనలో ఉండవచ్చు. ఆయనకే
మన కోరికలన్నిటిని తీర్చగలిగిన శక్తి ఉన్నపుడు సామాన్యులమయిన మనము ఆయనకేమివ్వగలం అనే
ఆలోచన తప్పు. ఇవ్వడమనేది ఏకపక్షంగా ఉండరాదు. ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉండాలి. భగవంతుడయినా సరే ముందు స్వీకరించిన తరువాతనే అనుగ్రహిస్తాడు. అందుచేతనే (Give and Take policy) ఇచ్చి పుచ్చుకోవడమనే
సాంప్రదాయం వాడుకలోకి వచ్చ్చింది.