03.06.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని
సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
19. 20.06.1992 రాత్రి 9 గంటలకు శ్రీ సాయి యిచ్చిన సందేశము
కర్మచే పవిత్రత, ధ్యానము భక్తిచే ప్రకాశము. జ్ఞానముచే ఐక్యత సిధ్ధించగలవు. కర్మ భక్తి సాధనలతో కైవల్య ప్రాప్తిని పొందవచ్చును. భక్తి యొక్కటియే ప్రపంచములో స్థిరమైనది, నాశరహితమైనది. సద్గుణ కుసుమాలలచే మీ హృదయ క్షేత్రమును, దైవముతో అలంకరించుకొనండి.