25.12.2013 బుధవారము (దుబాయ్ నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అద్భుతమైన సాయి లీలల గురించి తెలుసుకుందాము. సాయిబాబా అంటే ఎవరో తెలియని వ్యక్తికి తనలీలలు చూపించి తనభక్తునిగా చేసుకొని ఆతరువాత అతను సాయి ప్రచారకునిగా ఏవిధంగా మారాడొ చదవండి.
ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 102వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పధాచారః ప్రాణదః ప్రణవః పణః ||
తాత్పర్యం: నారాయణుని ఈ సృష్టి ఆధారమే తన నివాసమైనవానిగా, మరియూ అన్ని లోకములకూ ఆధారముగా, ధ్యానము చేయుము. పుష్పము వికసించుటవంటి తన చిరునవ్వుతో సృష్టిని భౌతిక లోకముల లోనికి వ్యక్తీకరుంచువాడు, అన్నిటియందు నిరంతరమూ మేల్కొని యుండువాడు, జీవులలో మంచిపనులు చేయు ఆచారమే తన మార్గముగా పైకి ప్రయాణము చేయువాడు, ప్రాణశక్తి నిచ్చువాడు, శ్వాసను, వాక్కును, సృష్టియొక్క మూల్యమును కూడా నిచ్చువాడునై యున్నాడు.
షిర్దీ సాయిబాబా తన లీలలను చూపించి సాయి ప్రచారకునిగా మార్చుట
బెంగళూరులో నివసిస్తున్న శ్రీకాంత్ శర్మ 1980 సంవత్సరం చివరలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజుల్లో అతను విపరీతమయిన ఆస్త్మాతో బాధ పడుతున్నాడు. శ్వాస సరిగా ఆడాలంటే ప్రతిరోజు డెరిఫిలిన్ రెటార్డ్ మాత్రలు వేసుకోవలసిందే. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను, అతని కుటుంబం తగినంతగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు కారు.