23.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా రహతా లోని శ్రీ చంద్రబాన్ సేఠ్ గారి ఇంటికి తరచుగా వెడుతూ ఉండేవారన్న విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరికి తెలుసు.
కొన్ని
సంవత్సరాల క్రితం సాయిపధం మాసపత్రిక వారు రహతా వెళ్ళి శ్రీ చంద్రబాను సేఠ్ గారి వారసులతో ముఖాముఖీ గా మాట్లాడి, బాబా గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలను సేకరించారు. ఇవి
మనకు శ్రీ సాయి సత్ చరిత్రలో కనపడవు.
ఈ సంభాషణలను shirdisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడినది.
శ్రీ చంద్రబాను సేఠ్ గారి మనుమడు శ్రీ జయచంద్ర సేఠ్, ఆయన మునిమనుమడు శ్రీ సురేంద్ర సేఠ్ లతో సాయిపధమ్ వారు ప్రత్యక్షంగా మాట్లాడి బాబా గురించి వెల్లడించిన విషయాలను రెండవ భాగం ఈ
రోజు మీకు అందిస్తున్నాను. వారి
సంభాషంతా మరాఠీలోను, ఆంగ్లంలోను జరిగింది.
శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 2 వ.భాగం
సా.ప.ప్రశ్న – బాబా మీ ఇంటికి వచ్చినపుడు
మీ ఇంటి లోపలికి ప్రవేశించేవారా?
లేక బయట వరండాలోనే కూర్చొనేవారా?
జ.చ.సేఠ్ – ఆయన ఇంటిలోపలికే వచ్చేవారు. అదిగో ఆ కనపడే ద్వారంలోనుండే వచ్చేవారు.
(శ్రీ జయచంద్ర సేట్ గారు సాయిపధం పత్రికవారికి
ఇంటి ప్రధాన ద్వారంవైపు చూపించారు)