30.01.2021 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా
వ్యాస గ్రంధము – 38 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస
కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
ఆ మరుసటిరోజు ఉపాసనీబాబా వంట చేసుకుంటున్నారు. ఆయనకు దగ్గరగా ఒక బిచ్చగాడు నుంచుని ఉన్నాడు. ఆయన బాబా చెప్పిన ఆదేశాలన్నీ మర్చిపోయారు. ఆచారం ప్రకారం గురువుకు గాని సాధువుకు గాని సమర్పించడం కోసం వండినవాటిని మొదటగా వారికి సమర్పించకుండా ఇతరులకు పెట్టరాదు. ఇది బలీయంగా ఎప్పటినుంచో వస్తున్న మతాచారం. ముందుగా దైవానికి సమర్పించకుండా మనం ఎవరికీ పెట్టము. అందువల్ల బిచ్చగాడిని చూడగానే ఉపాసనీబాబా అతనికి ఏమీ పెట్టకుండా పంపించి వేసారు. కొద్ది నిమిషాలలోనే తయారుచేసిన పదార్ధాలన్నిటినీ తీసుకుని సాయిబాబా వద్దకు వెళ్ళారు.