09.04.2021
శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 67 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – బొంబాయి
శనివారమ్, అక్టోబరు, 26, 1985
నా డైరీలోని ముక్యాంశాలు …
ఉదయం గం. 9.00 .. నాహోటల్ గదిలో. ఈ రోజు షిరిడీని వదిలి వెళ్ళేరోజు. ఈ రోజు తెల్లవారుజాము గం. 5.15 కి కాకడ ఆరతిలో పాల్గొన్నాను. నా సామానంతా సద్దేసుకున్నాను. స్వామి శేఖరరావు అడిగినమీదట అతనిని ప్రశంసిస్తూ మంచి పరిచయ ఉత్తరాన్ని వ్రాసాను. అతను ఎంతో నమ్మకమయినవాడని, అతని ధర్మం, విశ్వసనీయత, ఆదర్శప్రాయమయిన అతని ప్రవర్తన గురించి చాలా విపులంగా అతనిని ప్రశంసిస్తూ వ్రాసాను.