08.06.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక సాయిభక్తుడయిన చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గారి గురించి తెలుసుకుందాము.
సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
(నా సందేహాలు - సమాధానాలలో భాగంగా బాబా ఈరోజు ఇచ్చిన సమాధానమ్ -- దామూ అన్నా -నానాసాహెబ్ రాస్నే 5 వ.భాగంలో రాస్నే గారు, ఏదీ కూడా అంతిమంగా తన వెంట రాదని తెలిసినా, బాబా తనకు ప్రసాదించిన రాగినయాపైస నాణాన్ని తన శరీరంతోపాటె దానిని కూడా దహనం చేయమని అంతిమకోరిక కోరారు. ఆ నాణాన్ని ఆవిధంగా దహనం చేయమని అడగడం లోని ఆంతర్యం ఏమిటి, దానిని వారి కుటుంబీకులకే ఇవ్వవచ్చును కదా అని నాకు సందేహం కలిగింది. ఇదే సందేహాన్ని చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు కూడా వెలిబుచ్చారు. ఈ రోజు ఆవిధంగా చేయమనడంలోని రాస్నేగారి ఆంతర్యం ఏమిటి అని ధ్యానంలో అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం "పంచభూతాలు"
అనగా రాస్నేగారు తన శరీరం పంచభూతాలలో కలిసిపోయినట్లే ఆ రాగినయాపైస కూడా పంచభూతాలలో కలిసిపోవాలని కోరుకున్నారని గ్రహించుకున్నాను...ఓమ్ సాయిరామ్...త్యాగరాజు)
అన్నాసాహెబ్ అనబడే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ - 1 వ.భాగమ్
“నేనొక మహమ్మదీయుడిని”
నానా సాహెబ్ డెంగ్లే ద్వారా బాబా వద్దకు రప్పించబడిన అదృష్టవంతులలో అతను ప్రముఖుడు. ఆరోజులలో అహ్మద్ నగర్ కలెక్టర్ వద్ద
అన్నాసాహెబ్ కార్యదర్శిగా ఉండేవాడు.
ఆ పట్టణంలో నానాసాహెబ్ ప్రముఖ ఇమాన్ దారు. ప్రభుత్వశాఖలలో నానా సాహెబ్ కు మంచి
పలుకుబడి ఉంది. ఇద్దరూ
సహజంగానే భగవంతునిమీద భక్తివిశ్వాసాలు కలవారవడం వల్ల ఇద్దరూ మంచి ప్రాణస్నేహితులయ్యారు.