21.04.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి అమృత ధార
బాబా
చేసిన ధన సహాయం
ఈ
రోజు మనం మరొక అత్యధ్బుతమైన అమృత ధార గురించి తెలుసుకుందాము .
బాబా
గారు ద్వారకామాయిలో దక్షిణగా స్వీకరించిన సొమ్మునంతా మరలా భక్తులందరికీ ఉదారంగా పంచి
పెట్టేస్తూ ఉండేవారన్న విషయం మనకందరకూ తెలుసు.
బాబా వారికి సత్సంగాలంటే ప్రీతి. ఎక్కడ
సత్సంగాలు జరుగుతున్నా బాబా అక్కడ స్వయంగా ఉంటారనీ, కొంత మంది భక్తులపై తన అనుగ్రహాన్ని
ప్రసరిస్తూ ఉంటారన్న విషయం కూడా సత్సంగాలను నిర్వహిస్తున్న వారందరికి అనుభవమే.
ఒక్కొక్క సారి సత్సంగాలు జరుగుతున్నపుడు, ఆఖరులో
బాబా వారికి ఆరతి ఇస్తుండగా భక్తులలో కొందమందికి తమకు తెలియకుండానే కళ్ళంబట నీరు వస్తూ
ఉంటుంది. నేను నరసాపురంలో ఉండగా సత్సంగంలో
పాల్గొన్నపుడు నాకు కూడా అది అనుభవమే. మరికొంత
మందికి కూడా అటువంటి అనుభవమే కలిగింది. ఇప్పుడు
మనం సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం ఏవిధంగా చేశారో తెలుసుకుందాము. నరసాపురంలో సత్సంగం ప్రారంభిద్దామనుకున్న తన భక్తులకి
బాబా మొట్టమొదటి సారిగా ధనాన్ని ఎలా సమకూర్చారో అది కూడా ప్రచురిస్తున్నాను. ఈ లీలను 2011 సం.నవంబరు 11 వ. తేదీన ప్రచురించాను.
సందర్భం
వచ్చింది కాబట్టి మరలా చివరలో ప్రచురిస్తున్నాను చదవండి.
ఇప్పుడు
మీరు చదవబోయే లీల శ్రీసాయి లీలా మాసపత్రిక జనవరి, 1984 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
మొట్టమొదటి
సారిగా నేను పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజగారిని 1980 వ.సంవత్సరం జూలై నెలలో కలుసుకునే
భాగ్యం కలిగింది. అప్పుడాయన చివటం (పశ్చిమ గోదావరి జిల్లా ) గ్రామంలో సాయి తత్వ ప్రచారానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ రోజు చివటం అమ్మ మహాసమాధి చెందిన ‘మండలారాధన’
రోజే కాక గురుపూర్ణిమ రోజు కూడా అవడం వల్ల ఎతో మంది మహాత్ములు వచ్చారు.
(చివటం అమ్మ. ఈమె గొప్ప అవధూత. ఈవిడ దిగంబరంగానే తిరిగేవారు. చివటం గ్రామంలో ఆవిడ సమాధి కూడా ఉంది.)