20.04.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితంపై మరికొన్ని సందేశాలు.
శ్రీసాయి
పుష్పగిరి – జీవితమ్ – 4 వ.భాగమ్
12.03.2004
31. జీవితమనే
సాగరంలో నీవు ఒక కెరటానివి. కెరటం
ఎంత పైకి ఎగసినా ఆఖరికి
తిరిగి సాగరంలో కలసిపోవలసిందే. కాలమనే
కెరటం ఎవరికోసం ఆగదు. అలాగే
మానవ జీవితం కూడా ఈ కాల
గర్భంలో కలసిపోవలసిందే.
22.05.2004
33. పూర్వకాలంలో
నది ఒడ్దున ప్రజలు ఇళ్ళు కట్టుకొని నివసించేవారు. ఆ
నదికి వరదలు వచ్చినపుడు మాత్రము ఎత్తు ప్రదేశాలకు వలస
వెళ్ళి తిరిగి నదిలో నీరు తగ్గిన
తరువాత తమ ఇళ్ళకు చేరుకునేవారు. వారు
ఏనాడు నదిని ద్వేషించలేదు.
వారు ప్రకృతిలో కలసి జీవించేవారు.
కాని, ఈనాడు సమాజములో మానవులు
ప్రకృతిని ధ్వంసము చేస్తు తమలో తాము వైషమ్యాలను
పెంచుకుంటూ ఈ మానవాళిని సర్వనాశనము
చేస్తున్నారు.
28.07.2004
34. మందిరాలలో
భక్తులు భగవంతునికర్పించిన మిఠాయి నీ సొమ్ము కాదుకదా. దానిపై
నీకు హక్కు లేదు కదా. కాని,
ఆ ప్రసాదాన్ని పది మందికి పెట్టకుండా దాచి పెట్టుకుని తింటూ ఉంటే అర్ధమేమిటి? ఆ
ప్రసాదాన్ని చీమలు తింటూ ఉంటే
ఆ చీమలను పారద్రోలి నీవు ఆ ప్రసాదాన్ని
తినడంలో అర్ధమేమిటి?
అందుచేత
పరుల సొమ్ముపై మమకారాన్ని పెంచుకోవద్దు. పరుల
సొమ్ముపై మమకారాన్ని నీవు పెంచుకుంటే నీజీవితము
వ్యర్ధము.
35. మీ
జీవిత ప్రయాణంలో నేను మీకు తోడుగా
ఉన్నాను. మీ
ప్రయాణంలో అనేక కష్టాలు. ఆటంకాలు ఎదురుపడతాయి. దానివలన
మీరు మీగమ్యం చేరడానికి కొంత కాలయాపన జరుగవచ్చు. అపుడే
మీరు మీ నమ్ముకొన్న సబూరీని
ఆచరణలో పెట్టి శ్రధ్ధ అనే నమ్మకంతో మీ
గమ్యాన్ని చేరండి. నేను
సదా మీ జీవిత ప్రయాణంలో
మీకు తోడుగా ఉంటాను.
25.09.2004
36. ఆనాడు
పాండవుల కౌరవుల యుధ్ధానికి కారణం పరస్త్రీ వ్యామోహం,
పరులసొమ్ముపై వ్యామోహం. ఆనాడు
జరిగిన యుధ్ధం ఒక ధర్మ యుధ్ధంగా
జరిపించి భగవంతుడు అధర్మాన్ని నాశనం చేశాడు. కాని, ఈనాడు ప్రతిచోట
ప్రతిక్షణం పరుల సొమ్ము, పరస్త్రీల
పొందుకోసము యుధ్ధాలు జరుగుతున్నాయి. ధర్మాన్ని
కాపాడాలని ఎవరూ ముందుకు రావటంలేదు. మళ్ళీ
భగవంతుడే మానవావతారం ఎత్తి అధర్మాన్ని నాశనం
చేయాలి.
37. మనిషి
తను చేసుకున్న కర్మలను బట్టి మరుజన్మలో శిక్షలు
పొందుతాడనే విషయం తెలిసికూడా ఈ
జన్మలో తోటివాడిని
హింసించి, మరుజన్మలో శిక్ష పొందడానికి సిధ్ధపడుతున్నవారిని చూసి నేను బాధపడుతున్నాను.
18.01.2005
38. జీవించడానికి
ఏ ఆసరా సహాయము లేని
ఆ అనాధ పిల్లలను చూడు. వారు ధైర్యంగా
రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రపోతున్నా,
రోడ్డు ప్రక్కన నిద్రపోతున్నా, తమ జీవితాన్ని ముందుకు
కొనసాగిస్తున్నారు. వారికి
జీవించడానికి శక్తినెవరిచ్చారు? భగవంతుడే
కదా. నీకు
అన్నీ ఉన్నాయి. నీకు
జీవించాలి, ఏదయినా సాధించాలి అనే కోరిక ఉన్నపుడు
ఆ భగవంతుడిని వేడుకో. ఆయనే
నీకు మార్గం చూపుతాడు.
39. ఈ
శరీరము ఒకనాడు బూడిదయి మట్టిలో కలవవలసిందే. హరహర
గంగే అంటూ ఆఖరి స్నానమాచరించి
తిరిగి నూతన జన్మ ఎత్తవలసిందే.
40. శరీర
ఆకారము కాలగమనంలో వికారంగా మారవచ్చును. నీవు
వికారం గురించి ఆలోచిస్తూ మనస్సును బాధ పెట్టేకన్నా శరీర వికారము కూడా
జీవితంలో ఒక భాగంగా భావించి
జీవించడం మంచిది.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(రేపటి
సంచికలో మరొక అధ్బుతమైన సాయి అమృత ధార… బాబాకు సత్సంగమంటే ఎంతో ప్రీతి. మరి సత్సంగం చేయదలచుకున్నవారికి, ధనం అవసరమయితే
బాబా సమకూరుస్తారా? ఎవరి ద్వారానో ఇప్పించడం
కాదు, ఆయనే ఇస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆయనే ఎలా ఇస్తారో రేపటి
సంచికలో…)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment