19.04.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
దాదాపు మూడు నెలల తరువాత బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది. నేను నరసాపురం నుండి హైదరాబాదు రావడం ఇక్కడే స్థిరపడటం, బాబా దయవల్ల కొత్తగా అపార్ట్ మెంటు తీసుకోవడం, ఈ పనుల వల్ల బ్లాగులో ప్రచురణకు చాలా ఆలస్యమయింది. ఈ మూడు నెలలూ ఇళ్ళ వేటలో ఉండటం వల్ల ప్రచురణ సాద్యపడలేదు.
ఈ రోజు సాయి బంధు యోగమీనాక్షి గారి అనుభవాలను ప్రచురిస్తున్నాను. ఆమె అనుభవాలు హెతాల్ పటేల్ రావత్ గారి బ్లాగులోనుండి సంగ్రహింపబడింది. ఇక చదవండి. త్వరలోనే ప్రతిరోజు బ్లాగులొ ప్రచురణ కొనసాగుతుంది. (ఆత్రేయపురపు త్యాగరాజు 9440375411
tyagaraju.a@gmail.com)
tyagaraju.a@gmail.com)
బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి
బాబా నాకు విద్యనిచ్చారు
మనజీవితాలకి మార్గదర్శకుడు సాయిమాత. ఆయన మనలని సరియైన మార్గంలో నడిపిస్తూ దిశానిర్దేశం చేస్తారు. బాబాతో నా అనుభవాలని వివరిస్తాను. నేను 12వ.తరగతి చదువుతుండగా సాయి గురించి తెలిసింది. నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాను. కాని గాఢమైన నమ్మకం, భక్తి మాత్రం లేదు. కాని బాబాని పూజించడం ఎప్పుడయితే మొదలుపెట్టానో ఆయనతో నా అనుబంధం తొందరలోనే బాగా ఎక్కువయింది. బాబా లేకపోతే నేనే లేను అన్నంత ధృఢంగా ఆయన మీద భక్తి కలిగింది.