21.12.2013 శనివారము (దుబాయి నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం గురించి తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం ఆయనని ప్రార్ధించకపోయినా, వెంట ఉండి సహాయం చేసి, తను చేసిన సహాయం ఎలా జరిగిందో కూడా మన ఊహకు అందనంతగా చేసి చూపిస్తారు . ఏనాటి జన్మలో ఋణానుబంధమో. ఈజన్మలో తన భక్తునిగా చేసుకోవడానికి ముందుగా అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 101వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం: అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః ||
తాత్పర్యం: పరమాత్మను అన్ని భూతముల పుట్టుకకూ ప్రారంభకునిగా, తనకు తాను ప్రారంభము లేనివానిగా, లక్ష్మిగా, స్వయముగా ప్రకాశించు ఆభరణములు ధరించిన గొప్ప వీరునిగా, సమస్తమునకు మొట్టమొదటవానిగా, మరియు పుట్టుకలకు కారణమైనవానిగా ధ్యానము చేయుము. ఆయన రూపము భయము కలిగించును. ఆయన భయంకరమైన పరాక్రమము కలవాడు.
ప్రసవ సమయంలో ఆదుకున్న బాబా
ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం ఎటువంటిదో తెలుసుకొందాము. ఇది 1940 సంవత్సరం ప్రాంతంలో జరిగినది. ఇది సాయిలీల మాసపత్రిక 1940వ. సంవత్సరంలో ప్రచురింపబడింది..సాయిలీలాస్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడింది. యధాతధంగా ప్రచురిస్తున్నాను.