Saturday, August 1, 2020
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 4 వ.భాగమ్
Thursday, July 30, 2020
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 3 వ.భాగమ్
31.07.2020 శుక్రవారమ్
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ –
శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 3 వ.భాగమ్
శ్రీ సాయిబాబా తన భక్తులపై అవ్యాజ్యమయిన ప్రేమను కనబరుస్తారు. వారికేది మంచిదో వారికే తెలుసు. వారి యోగక్షేమాలపై శ్రధ్ధవహిస్తారు. భక్తులమీద ప్రేమజల్లులను కురిపించే సద్గురువు ఆయన. తనవద్దకు ఎవరు వచ్చినా సరే సాయిబాబా వారి యోగక్షేమాలను తనె వహిస్తారు. 11 వ.అధ్యాయంలో సాయిబాబా తన భక్తులకు చేసే బోధ, ఆయన ప్రేమవంటి విషయాలన్నీ మనం గమనించవచ్చు.
Wednesday, July 29, 2020
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 2వ.భాగమ్
29.07.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ - శ్రీ సాయి సత్ చరిత్ర 11వ. అధ్యాయమ్ రెండవ భాగాన్ని ప్రచురిస్తున్నాను.
రుద్రాధ్యాయం యొక్క ప్రభావమ్ –
శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 2వ.భాగమ్
శ్రీమతిమాధురి అంబేలాల్ దాంగ్ గారి అనుభవమ్ (అంధేరీ వెస్ట్, ముంబాయి)
సాయిలీల
ద్వైమాసపత్రిక
మార్చ్ – ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురింపబడింది.
శ్రీ సాయి సత్ చరిత్రలోని 11వ.అధ్యాయానికి, అనుభవానికి సంగ్రహంగా వివరణ మరాఠీ లో వ్రాసినవారు శ్రీమతి ప్రియంవద ప్రకాష్ కరాండే. వడలా వెస్ట్, ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీమతి మీనల్ తుషార్ దేశ్ పాండే
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
దాదాభట్ కి కూడా సాయిబాబా తన భక్తులపై వివక్షత చూపుతున్నారనే సందేహం కలిగింది.
తాత్యాసాహెబ్
నూల్కర్ స్నేహితుడయిన డాక్టర్ పండిత్ షిరిడీకి వచ్చాడు.
అతను
సాయిబాబా దర్శనానికి ద్వారకామాయికి చేరుకోగానే బాబా అతనిని దాదాభట్ వద్దకు వెళ్లమని చేతితో దారిచూపించారు. (అ.11 ఓ.వి. 51).