29.07.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ - శ్రీ సాయి సత్ చరిత్ర 11వ. అధ్యాయమ్ రెండవ భాగాన్ని ప్రచురిస్తున్నాను.
రుద్రాధ్యాయం యొక్క ప్రభావమ్ –
శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 2వ.భాగమ్
శ్రీమతిమాధురి అంబేలాల్ దాంగ్ గారి అనుభవమ్ (అంధేరీ వెస్ట్, ముంబాయి)
సాయిలీల
ద్వైమాసపత్రిక
మార్చ్ – ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురింపబడింది.
శ్రీ సాయి సత్ చరిత్రలోని 11వ.అధ్యాయానికి, అనుభవానికి సంగ్రహంగా వివరణ మరాఠీ లో వ్రాసినవారు శ్రీమతి ప్రియంవద ప్రకాష్ కరాండే. వడలా వెస్ట్, ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీమతి మీనల్ తుషార్ దేశ్ పాండే
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
దాదాభట్ కి కూడా సాయిబాబా తన భక్తులపై వివక్షత చూపుతున్నారనే సందేహం కలిగింది.
తాత్యాసాహెబ్
నూల్కర్ స్నేహితుడయిన డాక్టర్ పండిత్ షిరిడీకి వచ్చాడు.
అతను
సాయిబాబా దర్శనానికి ద్వారకామాయికి చేరుకోగానే బాబా అతనిని దాదాభట్ వద్దకు వెళ్లమని చేతితో దారిచూపించారు. (అ.11 ఓ.వి. 51).
బాబా సూచించిన ప్రకారం డాక్టర్ పండిత్ దాదాభట్టును కలుసుకొన్నాడు. దాదాభట్టు అతనిని ఆహ్వానించి, బాబాను పూజించటానికి వెడుతూ ద్వారకామాయికి నువ్వూ వస్తావా అని పండిత్ ని అడిగాడు. సరే అని పండిత్ కూడా అతనివెంట వెళ్ళాడు. దాదా బాబాను పూజించాడు. దాదా చేసిన పూజ పండిత్ కు ఎంతో అధ్భుతమనిపించింది. అది చూసి పండిత్ భక్తిపారవశ్యంతో దాదా చేతిలోని పళ్ళాన్ని అందుకుని బాబా నుదిటిమీద త్రిపుండ్ర రేఖలు దిద్దాడు. ఆ సంఘటన చూసిన దాదా చాలా భయపడ్డాడు. ఎవరికీ కూడా బాబావారి నుదుటను స్పృశించడానికి ధైర్యం లేదు. బాబా ఎవరినీ తన నుదుటిమీద బొట్టును పెట్టనివ్వరు. అటువంటిది డాక్టర్ పండిత్ త్రిపుండ్రరేఖలు దిద్దాడు.
దాదాభట్
నిశ్చేష్టుడయి
చూస్తూ ఉండిపోయాడు.
బాబాకి
ఆగ్రహం కలుగుతుందేమోనని భయపడుతూ నుంచున్నాడు.
కాని
అతను అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు.
బాబా
కోపగించలేదు. పైగా
ఎంతో ప్రసన్నులుగా కనిపించారు.
దాదా
భట్ కి ఏమీ అర్ధం కాకుండా ఉంది.
అతని
మనసులో సందేహం, అశాంతి కలిగాయి.
సాయంకాలం
బాబాని ప్రశ్నించాడు…”బాబా మమ్మల్ని ఎవరినీ కూడా మీనుదుటిమీద చిన్న బొట్టును కూడా పెట్టనివ్వరు, అటువంటిది డాక్టర్ పండిత్
మీ నుదుటిమీద
త్రిపుండ్రం
తీర్చిదిద్దితే
ఏమనకపోవడానికి
కారణమేమిటి? దీనిని
మేము అర్ధం చేసుకోలేకుండా ఉన్నాము.”
ఒక సద్గురువుకు, ఒక భక్తునికి మధ్య ఎటువంటి అనుబంధం ఉన్నదో గమనించండి.
తండ్రి/తల్లి చేత నిర్లక్ష్యం చేయబడిన బిడ్డలా దాదాభట్, విశ్వానికంతటికి గురువయిన బాబాకు ఎంతో ప్రేమగా తన అసంతృప్తిని వెల్లడించాడు.
పిల్లలగా
మనం తరచూ మన తల్లిదండ్రులు మనమీద పక్షపాతం చూపిస్తున్నారని భావిస్తూ ఉంటాము.
అన్నయ్య అంటేనే మీకిష్టం, నేనంటే ఇష్టం లేదు, వాడంటేనే ప్రేమ, నేనంటే మీకు ప్రేమలేదు అని తల్లిదండ్రులకి పిల్లలు ఒకోసారి ఆరోపణలు చేస్తూ ఉంటారు.
ఎందుకని?
అదేవిధంగా ఆరోజు ఉదయం జరిగిన సంఘటనని అర్ధం చేసుకోలేకపోతున్నామని దాదభట్ సాయిబాబా వద్ద తన అసంతృప్తిని తెలియచేసాడు.
దాదాభట్
అభ్యంతరాన్ని
సాయిబాబా చాలా ప్రశాంతంగా విన్నారు.
ఇదంతా
బాబా ఇచ్చానుసారమే జరిగింది.
ఇటువంటి
సంఘటనల ద్వారానే సాయిబాబా సమయం వచ్చినపుడెల్లా తన భక్తులకు సందేశాలను గాని, బోధనలను గాని చేస్తూ ఉంటారు.
సాయిబాబా
వారి ఉద్దేశ్యం కూడా అదే.
తన
భక్తుల మనసులో మెదిలే తప్పుడు అభిప్రాయాలను, చెడు ఆలోచనలను వెంటనే తొలగించేస్తూ ఉంటారు.
అపుడు
బాబా దాదాభట్ కి ఇలా సమాధానమిచ్చారు.
“పండిత్ యొక్క గురువు బ్రాహ్మణుడు.
పండిత్
తానొక పవిత్ర బ్రాహ్మణుడినని, మహమ్మదీయుడయిన ఈ బాబాను ఎట్లా పూజించాలని ఒక్కక్షణం కూడా సందేహించకుండా తన గురువును పూజించినట్లే నన్ను పూజించాడు.
నాలో
తన గురువుని దర్శించుకున్నాడు.
అందువల్లనే
నేనతనికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.”
ఇపుడర్ధమయిందా దాదా?
నన్నూ,
తన గురువునూ ఒకేలాగా భావించాడు.
అతను
ఎటువంటి భేదాన్ని చూపని కారణంగానే నా నుదుటిమీద త్రిపుండ్రం దిద్దినా నేను అడ్డుచెప్పలేదు.
అతనిలోని
నిర్మలమయిన అమాయకమయిన భక్తికి అద్వైత భావానికి నేను కట్టుబడి అతను చేసే పూజకు అడ్డుచెప్పి నిరాశపరచలేదు.
ఇపుడు చెప్పు, హృయదయంనిండా నిష్కళంకమయిన భక్తిని నింపుకుని ఉన్న అతనిని నేను తిరస్కరించగలనా?
ఎటువంటి
సంకోచం లేకుండా చాలా సులువుగా ఎంతో విశ్వాసంతో అతను నానుదిటిమీద త్రిపుండ్రాన్ని దిద్దాడు.
నేనతని
భక్తిని కాదనగలనా?
ఆవిధంగా సాయిబాబా దాదాభట్ కి పూర్తివివరణ ఇచ్చి అతనిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు.
కాని
అక్కడ ఉన్న భక్తులందరు సాయిబాబా బోధించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అర్ధం చేసుకున్నారు.
కాని,
ఆసమయంలో తను చేసిన ఆరోపణకి, బాబా చెప్పిన వివరణకి ఎటువంటి సంబంధం లేదనుకున్నాడు దాదా భట్.
ధోపేశ్వర్
లోని కాకా పురాణిక్ అని పిలువబడే రఘునాధ్ సిధ్ధ్, పండిత్ యొక్క గరువుగారని ఆతరువాత అతనికి అర్ధమయింది.
పండిత్ సాయిబాబాను చూడగానే ఆయనలో తన గురువయిన కాకాపురాణిక్ గారిని వాస్తవంగానే దర్శించాడు.
ఆవిధంగా
తన గురువుకు చేసినట్లే బాబానుదుటిమీద త్రిపుండ్రాన్ని దిద్దాడు.
ఒకవ్యక్తి దేనినయితే నమ్ముతాడో అదే అనుభవమవుతుంది. పండిత్ లో ఉన్న నమ్మకాన్ని బట్టే సాయిబాబా తనలో అతని గురువుని దర్శింపచేసారు.
డా.పండిత్ లో ఉన్న భక్తివల్లనే అతనికి అటువంటి అనుభవం కలిగింది.
ఈ
సంఘటన సాయిబాబా తన భక్తులపై చూపించే ప్రేమని, బంధాన్ని వివరిస్తుంది.
ఇదే అధ్యాయంలో బాబా చెప్పిన మాటలు…
“నేనెవరినైనా కోప్పడ్డట్లు నాకు గుర్తులేదు.
తల్లి
బిడ్డను తరిమేస్తే, సముద్రం నదిని వెళ్ళగొడితే, నేను మిమ్మల్ని నిరాకరిస్తాను.
నేను
మీహితాన్నే కోరుతాను.
నేను
భక్తులకి అంకితుణ్ణి.
వారి
వెన్నంటే ఉంటాను.
నేనెప్పుడూ
ప్రేమనే కోరుతాను.
పిలిచిన
వెంటనే పలుకుతాను.”
(అ.11 ఓ.వి. 76)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment