24.04.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులందరికి బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు -
బాబా సమాధానాలు - 1
(ఈ సందేహాలు సమాధానాలను ఎవరైనా తమ స్వంత బ్లాగులో
ప్రచురించుకోదలచినట్లయితే ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగా
నా మనవి)
ఆత్రేయపురపు త్యాగరాజు
ప్రచురించుకోదలచినట్లయితే ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగా
నా మనవి)
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ .. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేసే సమయంలో నాకు కొన్ని
సందేహాలు కలిగాయి. ఆ సందేహాలకు సమాధానాలు బాబా తప్ప ఇంకెవరూ ఇవ్వలేరని నేను
భావించాను. మొట్టమొదటగా నాకు ఒక సందేహం కలిగింది. ఆ
తరువాత బాబాను రెండవ సందేహాన్ని నివృత్తి చేయమని అడిగాను. అడగడానికి
ముందు మనసులో బాబాని ఇలా ప్రశ్నించాను.
“బాబా నీ భక్తులను ఎటువంటి సందేహాలు ఉన్నా, లేక ఏమన్నా అడగదలచుకున్నా నిన్నే అడగమని చెప్పావు. మధ్యవర్తుల వద్దకి వెళ్ళి అడగవద్దని చెప్పావు. నాకు వచ్చిన సందేహాలను నువ్వే తీర్చాలి” అంతే కాదు, “బాబా, నీ చరిత్ర అందరూ చదువుతున్నారు. కాని కొన్ని కొన్ని విషయాలలో ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. కాని వాటికి కారణం ఇంతవరకు ఎవరికి తెలియదు నీకు తప్ప. అందువల్ల నాకు కలిగిన సందేహాలను నువ్వే తీర్చాలి. ఏదయినా నిన్నే అడగమని నువ్వే చెప్పావు. ఎవరినీ అడగవద్దన్నావు. నువ్వు ఇచ్చిన సమాధానాలను సాయిభక్తులందరికి తెలియచేస్తానని బాబాకు విన్నవించుకున్నాను.
“బాబా నీ భక్తులను ఎటువంటి సందేహాలు ఉన్నా, లేక ఏమన్నా అడగదలచుకున్నా నిన్నే అడగమని చెప్పావు. మధ్యవర్తుల వద్దకి వెళ్ళి అడగవద్దని చెప్పావు. నాకు వచ్చిన సందేహాలను నువ్వే తీర్చాలి” అంతే కాదు, “బాబా, నీ చరిత్ర అందరూ చదువుతున్నారు. కాని కొన్ని కొన్ని విషయాలలో ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. కాని వాటికి కారణం ఇంతవరకు ఎవరికి తెలియదు నీకు తప్ప. అందువల్ల నాకు కలిగిన సందేహాలను నువ్వే తీర్చాలి. ఏదయినా నిన్నే అడగమని నువ్వే చెప్పావు. ఎవరినీ అడగవద్దన్నావు. నువ్వు ఇచ్చిన సమాధానాలను సాయిభక్తులందరికి తెలియచేస్తానని బాబాకు విన్నవించుకున్నాను.
ఇంతకు కొన్ని నెలల ముందు మీరు శ్రీ సాయిబానిస గారి “శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి” లొ ఆయన అడిగిన ప్రశ్నలకు బాబా వారు ఇచ్చిన సమాధానాలు
చదివారు. కాని
ఆయన కళ్ళకి దృష్టి దోషం రావడమ్ వల్ల అది మధ్యలోనే 11.05.2019 నుండి ఆపేసారు. నాకు
కలిగిన సందేహాలను ఆయన ద్వారా తెలుసుకోవాలనుకున్నా గాని సాధ్యపడలేదు. అందు
వల్ల నేనే
బాబాని అడుగుదామనే ఆలోచన, ఆసక్తి ఈమధ్యనే కలిగింది.
మనం ఏదయినా
అడగదలచుకున్నప్పుడు తననే నేరుగా అడగమని బాబా చెప్పేవారు. ఇతరులను
అడగవద్దని అనేవారు.
( శ్రీ బి. వి. దేవ్)
సాయిబాబా బి.వి. దేవు తో అన్న మాటలు శ్రీ సాయి సత్ చరిత్ర అ.41 “నా
గుడ్డ పీలికలను
నాకు తెలియకుండ దొంగిలించితి వేల?
నేను నీకు జల్తారు
సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొని యున్నాను. ఇతరుల
వద్దకుపోయి దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నాదా?” (ఇక్కడ జలతారు సెల్లా అనగా బాబా గారి ఉద్దేశ్యం నీకు కలిగే సందేహాలన్నిటికి వివరంగా చెప్పటానికి స్వయంగా నేనే ఇక్కడ ఉండగా ఇతరులను అడిగి తెలుసుకోవడమెందుకు అని మనం గ్రహించుకోవాలి)
గుడ్దపీలికలను దొంగిలించుట యనగా దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టములేదు. ఏప్రశ్నకైన సమాధానము ఇచ్చుటకు తామే సిధ్ధముగా నుండిరి. ఇతరులనడుగుట బాబాకు ఇష్టములేదు. అంతే కాదు, ఇతరులను అడుగకుండా సర్వము బాబానె అడిగి తెలిసికొనవలయునని, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు బాబా చెప్పారు. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను.
ఈ ఏప్రిల్ నెల 3 వ.తారీకున బాబాను మొదటి సందేహాన్ని
అడిగాను. అది
శ్రీ సాయి సత్ చరిత్ర 14 వ.ధ్యాయంలో “మొట్టమొదట బాబా ఏమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన
అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు.”
03.04.2020 ఈ
రోజు ధ్యానంలో బాబాను అడిగిన ప్రశ్న.
బాబా నువ్వు కాల్చిన అగ్గిపుల్లలను జేబులో ఎందుకు
వేసుకునేవాడివి?
దానికి బాబా చెప్పిన సమాధానమ్ (అంతర్వాణి ద్వారా) -- "నన్ను
పిచ్చివాడిననుకుంటున్నావా?"
ఆయన ఇచ్చిన సమాధానమ్ అదే. ఇంక
దానికి విశ్లేషణ నన్నే చేసుకోమని ఆయన అభిప్రాయమ్
అంటే బాబా పిచ్చివాడు కాదు. అవధూతలు
ఏవిధంగా ఉంటారంటే ఒంటినిండా దుమ్ముతో ప్రజలెవరూ తమవద్దకు రాకుండా పిచ్చివాళ్ళలాగ
ఉంటారు. అంటే
వారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నవారు. ఎవరూ
తమ ఆధ్యాత్మిక జీవనానికి భగం కలిగించకుండా ఆవిధంగ ప్రవర్తిస్తారు. అదే
విధంగా బాబా కూడా మొట్టమొదటలో తాను ఒక పిచ్చివాడిననే భ్రమ కలిగించటానికి ఆవిధంగా
ప్రవర్తించేవారు.
(ఆర్ధర్ ఆస్బర్న్ వ్రాసిన “మహామహిమాన్వితులు సాయిబాబా ఈ కాలపు అద్భుత యోగి కధ “ పుస్తకం మొదటి అధ్యాయం సాయిబాబా పరిచయం లో ….)
“అడుగో, పిచ్చి ఫకీరు మళ్ళి వస్తున్నాడు” కొట్లవాళ్ళు
వీధి ఎగువకు చూశారు. పొడుగ్గా సన్నగా ఉన్న పడుచువాడొకడు అంగలు వేసుకుంటూ తమవైపు
వస్తూ ఉండటం చూశారు. అతని నడకలో ధాటి ఉంది. కాని
అతను ఎవర్నీ పట్టించుకోవడం లేదు.
ఎవరితోనూ మాట్లాడటం
లేదు. మొదట్లో
వచ్చినపుడు అతనొక వేపచెట్టు కింద ఉండేవాడు. పగటివేళ చెట్టుకింద కూర్చుని రాత్రివేళ కటికనేలమీద
పడుకొనేవాడు. అతనికి వేపకాయంత వెఱ్ఱి ఉన్నట్లు వాళ్ళకు అనిపించింది. అతను
వాళ్ళతో కలిసేవాడు కాదు. చాలా అరుదుగా మాట్లాడేవాడు. )
(శ్రీ
సాయి సత్ చరిత్ర 8 వ.ధ్యాయమ్ లో ….”మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి, అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై
రొట్టెముక్కలకై గ్రామములో భిక్షమెత్తి పొట్టపోసికొనెడు పేదఫకీరన్న ఎవరికి
గౌరవమేమియుండును? వారి చర్యలు అంతుబట్టనివి.)
తను తెచ్చిన బిక్షనంతా మూతలేని కుండలో వేసేవారు. దానికి మూత లేకపోవటంతో కుక్కలు, కాకులు, పిల్లులు వచ్చి తింటూ ఉండేవి. బాబా వేటినీ అదిలించేవారు కాదు. మసీదును ఊడ్చే స్త్రీ కూడ పది పన్నెండు రొట్టెలను తీసుకునిపోయేది. ఎవరైనా బీదవారు, అనుకోని సందర్శకులు వస్తే వారికి కూడా ఆ కుండలోని పదార్ధాలే పెట్టేవారు. సందర్శకులను రానీయకుండా చేయటానికి బాబా కొన్ని సార్లు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను పిచ్చి ఫకీరు అనేవారు. ఆయన వద్దకు వెళ్ళి ఇబ్బంది పెట్టేవారు కాదు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో మరొక సందేహమ్ - బాబా సమాధానమ్)
0 comments:
Post a Comment