20.03.2021
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 56 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – ఉద్దవరావు
మాధవరావు దేశ్ పాండే గారి ఇంటిలో ఉ. గం. 11-30 కి
మాధవరావు దేశ్
పాండే (శ్యామా) గారి ముమారుడు 79 సం.వయస్సు గల ఉద్దవరావు మాధవరావు దేశ్ పాండే గారితో
రెండవసారి జరిపిన సంభాషణ. శ్యామా సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తుడే కాక ఆయనకు మధ్యవర్తిగా కూడా ఉండేవారు.
ఉధ్ధవరావు
చెబుతున్న విషయాలు …
బాబా వంట ప్రారంభించడానికి ముందుగా పాత్రలన్నిటినీ మసీదులోకి తీసుకువచ్చేవారు. మసీదులో ధుని మండుతూ ఉంటుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మాధవ్ ఫన్స్ లే అనే అతను గిన్నెలలో నీళ్ళుపోసి బాబాకు సహాయం చేసేవాడు. అపుడు బాబా వంట ప్రారంభించేవారు. కూరలను కడిగి వాటిని తరగడంలో మాధవ్, బాబాకు సహాయం చేసేవాడు.