సాయి బంధువులకు ఒక మనవి.
14.09.2012 న "బాబా నాపెళ్ళికి సర్వం సమకూర్చారు" ప్రచురించాను. ఈరోజు సాయిబంధువులలో ఒకరు నాకు ఫోన్ చేసి ప్రచురణ మీద
కొంత సద్విమర్స చేయడం జరిగింది. వారి
విమర్శ ను సంతోషంగా అంగీకరిస్తున్నాను. ఇది శ్రిమతి ప్రియాంకా రౌతేలాగారి బ్లాగు లొ ప్రచురింపబడటంవలన దీనిని అనువాదం
చేయడం జరిగింది. ఇందులో అనుభవాన్ని రాసిన ఆమె కూడా తాను ఇటువంటి క్లిష్ట దశవలననే బాబాను తెలుసుకోగలిగాను అని చెప్పడం,
ఆమె బెంగళూరులోని స్థూపానికి కూడా ప్రదక్షిణలు చేసి శ్రధ్ధగా బాబాని ప్రార్ధించడం వీటినే దృష్టిలో పెట్టుకుని ప్రచురించడం జరిగింది. ఇది మరెవరికయినా అభ్యంతరకరంగా ఉంటే మన్నించవలసినదిగా కోరుతున్నాను. ఇక ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా
మన బ్లాగు పూర్తిగా సాయి భక్తికే అంకితమయేలా చూస్తానని మనవి చేసుకుంటున్నాను. దీనిమీద అందరి అభిప్రాయాలను కోరుతున్నాను.
మన సద్గురువు బాబా కి క్షమాపణలతో
మీ అభిప్రాయాలను నా మెయిల్ ఐ.డీ.కి పంపండి. లేదా నాకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు: 9440375411
ఈ రోజునుండి సాయి.బా.ని.స. శ్రీ శివస్వరూపము - సాయి ప్రారంభిస్తున్నాను. మీ అభిప్రాయాలను కూడా నాకు తెలపండి.
త్వరలో మీకు అధ్బుతమైన "శ్రీ సాయితో మధుర క్షణాలను"
అందిస్తాను. ఈ లీలలను మనకు ప్రతీక్షణం బాబాను తలపుకు
తెస్తాయి . సాయి భక్తిలో ఓలలాడుతాము.
మీరు చదివే ప్రతీ ప్రచురణకి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో
తెలిపినా సరే, నాకు మెయిల్ చేసినా సరే. tyagaraju.a@gmail.com
ఓం సాయిరాం.