22.03.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 13 వ భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (13)
03.05.1995
నిన్న రాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "కష్ఠము - దఃఖము" లను వివరణ యిస్తు చూపిన దృశ్యాలు - వాటి వివరణ. "కష్ఠము - దఃఖము" అనేవి మానసిక స్థితికి సంబంధించినవి. ఉదాగరణగా చెప్పాలి అంటే ---
1) నీవు జీవితములో కష్ఠ్పడి సంపాదించిన ధనమును దొంగలు దోచుకొనిపోయిన రోజున నీమనసుకు కలిగేది మానసిక కష్ఠము.
2) ఆత్మీయులు చనిపోయనపుడు వారిని కడసారిగా చూడటానికి శ్మశానానికి పరిగెత్తిన అక్కడ కడసారి చూపు దొరకని సమయములో కలిగేది దఃఖము.
04.05.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి వివాహ వ్యవస్థ మీద సలహాను ప్రసాదించమని వేడుకొని నిద్రపోయినాను. శ్రీసాయి కలలో అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "ఏదో ఎక్కడో పెళ్ళి సంబంధము యున్నది అని విని వారి గురించి మంచి చెడ్డలు తెలుసుకోకుండ వివాహము జరిపి బాధపడేకన్న - ముందుగానే మగపెళ్ళివారి విషయములో టై కట్ (గూధచారిపని) చేసి పూర్తి వివరాలు తెలుసుకొని వివాహము నిశ్చయించుకోవాలి. అంతేగాని గుడ్డిగా మధ్యవర్తులను నమ్మి వివాహములో తలనొప్పి తెచ్చుకోరాదు. తరవాత భగవంతుని నిందించరాదు" అని అన్నారు.
05.05.1995
నిన్నరాత్రి కలలో సాయి చెప్పిన విషయాలు. "మానవుని జీవితములో కష్ఠ సుఖాలు త్రిగుణాలవలన వస్తాయి. ఆత్రిగుణాలను కోరికలు అనే స్త్రీలు మనలో పెంచుతున్నారు. నీవు ఆస్త్రీలను నీమనసునుండి తొలగించు. అపుడు నీవు కష్ఠ సుఖాలకు అతీతుడువిగా జీవించగలవు. యికపోతే శారీరక కష్ఠాలు అనేవి అంటే అనారోగ్యము మొదలైనవి నీపూర్వ జన్మ పాపాలవలన కలుగుతాయి. వాటిని అనుభవించక తప్పదు.
07.05.1995
ఈరోజున మధ్యాహ్న్నము రెండుగంటలకు నిద్రపోయినాను. ఆకలలో సాయి చూపిన దృశ్యము. నేను, నా భార్య, నాకుమార్తె, నాకుమారుడు రైలులో విశాఖపట్నము బయలుదేరినాము. రైలు సామర్లకోట చేరినది. నాకుమార్తె జ్వరముతో బాధపడసాగినది. నేను సామర్లకోటలో అందరిని దిగమని చెప్పి అందరిని కాకినాడ రైలు ఎక్కి కాకినాడలో డాక్టర్ లక్ష్మి (నామేంకోడలు) దగ్గరకు వెళ్ళి నాకుమార్తెకు మందు తీసుకోవాలి అని చెప్పినాను"
శ్రీసాయి లీల 07.05.1995
సాయంత్రము ఐదు గంటలు. నాకుమార్తె విపరీతమైన తలనొప్పితో (మైగ్రైన్) నా యింటికి వచ్చి తనను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరినది.
08.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మికపరమైన విషయాలు చెప్పమని వేడుకొన్నాను.
శ్రీసాయి చూపిన దృశ్యము వివరాలు. అది ముస్లిం నవాబుల రాతిమేడ.
ఒక కుక్క ఆయింటి యజమానిపై విశ్వాసముతో ఆమేడ చుట్టు కాపలా తిరుగుతున్నది. నేను నాతండ్రి సాయంత్రమువేళలో ఆనవాబును దర్శించుకోవటానికి ఆరాతిమేడ దగ్గరకు వెళ్ళినాము. ఆకుక్క నన్ను చూసి ప్రేమతో నాదగ్గరకు వచ్చి తోక ఆడించినది. నేను ప్రేమతో ఆకుక్క తలపై చేతితో నిమిరినాను. యింతలో ఆమేడలో పనిచేస్తున్న పనివాడు "రజాక్" వచ్చి నన్ను నాతండ్రిని మేడ ప్రక్కన ఉన్న విడిదిలోనికి తీసుకొని వెళ్ళినాడు. ఆపనివాడు నాతో చాలా మర్యాదగా మాట్లాడినాడు. "నవాబుగారు తోటలోనికి వెళ్ళినారు. వారు వచ్చే సమయము అయినది. అంతవరకు విశ్రాతి తీసుకోండి" అని చెప్పి మమ్మలను నేలమీద వేసిన తివాచి మీద కూర్చుండపెట్టినాడు. సాయంత్రము ఏడు గంటల సమయములో "రజాక్" రాతిమేడలోని దీపాలు వెలిగించినాడు. ఆసమయములో నవాబుగారు తోటలో నమాజు పూర్తి చేసుకొని వచ్చినారు. మారాకను ఆపనివాడు "రజాక్" నవాబుగారికి చెప్పినాడు. నవాబుగారు మావైపుకు నడచి రాసాగినారు. ఆయన ఆజానుబాహువు మనిషి. నెత్తిమీద చిన్నపాటి తెల్లని టోపీ యున్నది. తెల్లని కఫనీ ధరించి యున్నారు.
ఆయన నన్ను చూసి మూడుసార్లు నాకు సలాము చేసినారు. నేను కుడా ఆయనకు మూడు సార్లు సలాము చేసినాను. ఆయన నన్ను ప్రేమతో కౌగలించుకొన్నారు. తల్లి తన బిడ్డను కౌగలించుకొన్న అనుభూతిని పొందినాను. నానోట మాటలు రాలేదు. ఆయన నన్ను మాట్లాడమన్నారు. "జీవితాంతము మీరు నాపై యిటువంటి ప్రేమనే ప్రసాదించండి" అని అన్నాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు