20.03.2012 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 12 వ.భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (12)
18.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీ సాయి నేటి సమాజములోని కొందరు వ్యక్తుల నడవడికను చూపించి వీరు అందరు మదముతో జీవించుతున్నారు. అటువంటి జీవితము మంచిది కాదు అన్నారు. శ్రీసాయి చూపిన వ్యక్తుల వివరాలు. 1) తాము పెద్ద హోదాలో ఉన్నామనే గర్వముతో తల్లితండ్రులను తూలనాడుతున్న తనయులు.
2) తను లక్షలకు అధికారిని అనే మద గర్వముతో, తోబుట్టువులను చిన్న చూపుతో చూస్తున్న సోదరులు.
3) కన్యను దానముగా స్వీకరించిన తర్వాత ఆడపెళ్ళివారిని చులకనగా చూస్తున్న మగపెళ్ళివారు. 4) పాస్చాత్య సాంప్రదాయాలును అనుకరించుతు గురువును గౌరవించని విద్యార్ధులు - వీరు అందరు మదముతో జీవించుతున్న వ్యక్తులు.
19.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నవానిని చూపి,
యితడు క్రిందటి జన్మలో మాత్సర్యముతో జీవించినాడు అతని క్రిందటి జన్మ వివరాలు చూడు అని చూపించిన దృశ్య వివరాలు.
"ఒక కోటీశ్వరునికి అన్నీ ఉన్నాయి. కాని మంచి పేరు, పలుకుబడి లేదు. ఒక బీదవానిని మాత్రము మంచి పేరు, పలుకుబడి యున్నది. ఈబీదవానిని ప్రజలు భగవంతునిగా పూజించటము ఆకోటీశ్వరుదు చూడలేక మానసిక బాధతో కృగి కృశించిపోసాగినాడు. ఆబాధతో మరణించి ఈజన్మలో తిరిగి కుష్టువ్యాధి రోగిగా బాధపడుతున్నాడు. అందుచేత మాత్సర్యాన్ని విడనాడాలి."
23.04.1995
నిన్నటిరాత్రి కలలో శ్రీ సాయి సంసార జీవితము భార్య భర్తల అనుబంధముపై చక్కని సందేశము యిచ్చినారు. వాటి వివరాలు. "జీవితములో బరువు బాధ్యతలు పూర్తిచేసుకొని భార్య భర్తలు భగవంతుని సేవ చేసుకోవటము మంచిదే.
కాని శరీరము విడిచే సమయములో ఒకరిపై యింకొకరికి వ్యామోహము యుండరాదు. అటువంటి వ్యామోహముతో కన్ను మూసితే ఈ నరజన్మ వదలి మరల వానర జన్మ ఎత్తవలసియుంటుంది.
అందుచేత అంత్యకాలములో భగవంతునిపై ధ్యానము చేస్తు ఉత్తమ జన్మను పొందవలెను."
30.04.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి నావిరోధి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు. "నీవు నీతల్లి మాటలు వినకపోతే ఆమెకు నీపై కోపము రావటము సహజమే. కాని నీవు కష్ఠాలలో యున్నపుడు ఆతల్లికి నీపై ప్రేమ కలగటము కూడ సహజమే. ఈవిధమైన భావన నీలో యున్ననాడు నీకు విరోధులే యుండరు."
02.05.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "సుఖము" - సంతోషము" లను వివరణ యిస్తు చూపిన దృశ్యాలు. వాటి వివరణ. "సుఖ - సంతోషాలు" అనేవి మానసిక స్థితి. ఒక్కొక్కరిలో ఒక విదముగా యుంటాయి. ఉదాహరణగా చెప్పాలి అంటే.
1) తమపిల్లల అభివృధ్ధి గురించి యితరులు మంచిగా మాట్లాడుతున్నపుడు ఆతల్లి తండ్రులకు కలిగేది సంతోషము.
2) చక్కగా ముస్తాబు అయి పెండ్లి భోజనాలలో పాల్గొని భోజనము చేసేటప్పుడు కలిగేది సుఖము.
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment