06.09.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా ధైర్యాన్నిస్తారు
ఈరోజు శ్రీసాయిరామచరిత్రలోని నాకు నచ్చిన ఘట్టాలను ప్రచురిద్దామమనుకున్నాను. కాని మైల్ బాక్స్ ని చూసినప్పుడు విజయగారు పంపిన అనుభవం కనిపించింది. వెంటనే ఆమె అనుభవాన్ని ప్రచురిద్దామనిపించి ఈ రోజు ప్రచురిస్తున్నాను.
జీవితంలో మానవుడికి సహజంగా కష్టాలు, సమస్యలు సహజం. మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఈ జన్మలో మన జీవితం గడుస్తుంది. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితం వడ్డించిన విస్తరి కలిగిఉన్నవాడికయిన కొన్ని కొన్ని కష్టాలు, సమస్యలు తప్పవు. వీటినుండి బయటపడటానికి ఒక్కటే మార్గం. అదే నిరంతరం భగవన్నామ స్మరణ. భవబంధాలనుండి, భవసాగరాన్ని సులువుగా దాటించేది ఆ భగవన్నమస్మరణే.
ఈ రోజు ఒక సాయి భక్తురాలైన విజయ గారు తమ అనుభవాన్ని ఈ మైల్ ద్వారా పంపించారు. ఆమె పంపించిన ఈ మైల్ ని యధాతధంగా ప్రచురిస్తున్నాను. ఆమె సమస్యలకి బ్లాగులో సమాధానాలు దొరికి ఉపశమనం కలిగితే అంతకన్నా కావలసిన ఆనందం ఏముంటుంది. మనసమస్యలకి సమాధానాలు శ్రీసాయి సత్ చరిత్రలో లభిస్తాయి.
బాబా ఆమెకి ప్రతిక్షణం తోడూ నీడగా ఉండి శుభాశీస్సులు కలుగచేయాలని ప్రార్ధిస్తున్నాను.
ఓం సాయిరాం