Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 19, 2020

వంద కోట్ల రూపాయలు

0 comments Posted by tyagaraju on 6:52 AM

 




19.11.2020 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

వంద కోట్ల రూపాయలు

రోజు మరొక కొత్త విషయాన్ని ప్రచురిస్తున్నాను.  ప్రపంచంలో పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక ఆశ ఉంటూనే ఉంటుంది.  అది ఎవరూ కాదనలేని నిత్య సత్యం.  ఆశ అనేది కాస్తో కూస్తో ఉండచ్చు గాని, మరీ అత్యాశ ఉండకూడదు.  ప్రతివాడు తనకి ఉచితంగా కావాలనుకోవడం మరీ దురాశ.  ఎదటివారినుంచి ఏదో విధంగా లబ్ధి పొందాలనుకోవడం కన్నా మనం ఇతరులకు ఏమయినా సాయపడుతున్నామా అని ఆలోచించాలి.  మనం కష్టపడి ఏదయితే సంపాదిస్తామో అది చిన్న మొత్తమయినా సరే అదే మనకు కొండంత తృప్తిని ఇస్తుంది

పుడు ప్రచురిస్తున్న వృత్తాంతం శ్రీ షిరిడీసాయి ట్రస్ట్.ఆర్గ్ లో సాయిసరోవర్ గురజాతీ పుస్తకంనుండి ప్రచురింపబడింది. 

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

శ్రీ సాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి బాబా ఏవిధంగా హితబోధ చేసారో మనకు తెలుసు.  ఇపుడు పదికోట్ల రూపాయలు కావాలని వచ్చిన ఒక వ్యక్తిని మరొక సాధువు వద్దకు పంపించి బాబా వ్యక్తికి ఏవిధంగా గుణపాఠం చెప్పారో వివరిస్తున్నాను.

Wednesday, November 18, 2020

బాబా వాక్కు అమోఘమ్

0 comments Posted by tyagaraju on 6:44 AM

 



18.11.2020  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబా వారి వాక్కు ఎంత శక్తివంతమయినదో తెలిపే ఒక అధ్బుతమయిన లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.

శ్రీ సాయి లీల   సంవత్సరం I అశ్విన్ శక.సం.1845/వాల్యూమ్.8 సాయి అమృతాధార నుండి  గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్.. ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

బాబా వాక్కు అమోఘమ్

అళంది, శ్రీ పద్మనాభేంద్రస్వామి గారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఉత్తరాల ద్వారా బొంబాయిలో ఉన్న శ్రీ హరి సీతారామ్ దీక్షిత్ గారికి తెలియచేసారు.  ఆ ఉత్తరంలో ఆయన స్వయంగా వివరించిన అనుభవాలు…

“జనవరి 29వ.తారీకు గురువారమునాడు మీ దగ్గరనుంచి బయలుదేరి షిరిడీ వెళ్ళాను.  అక్కడినుండి అళందికి చేరుకొన్నాను.  ఫిబ్రవరి రెండవ తారీకున గురుమహరాజ్ గారి సంవత్సరీకాలు పూర్తయిన తరువాత మంగళవారమునాడు బొంబాయికి చేరుకొన్నాను.  నా చెవికి వెనుక భాగంలో వాపు వచ్చింది.  దానిని డా.అండర్ వుడ్ గారికి చూపించాను.  

Monday, November 16, 2020

గాడ్గే మహరాజ్

0 comments Posted by tyagaraju on 4:28 AM




16.11.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కార్తిక మాస శుభాకాంక్షలు

ఈ రోజు గాడ్గిల్ మహరాజ్ గారి గురించిన ఒక అధ్భుతమయిన విషయాన్ని గురించి ప్రచురిస్తున్నాను.  కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ షిరిడీ సాయిబాబాతో తర్ఖడ్ కుటుంబంవారికి కలిగిన అనుభవాలను ప్రచురించాను.  అందులో గాడ్గిల్ మహరాజ్ గారి గురించి సాయి భక్తులు చదివే ఉంటారు.  ఇప్పుడు ఆయన గురించి మరొక ఆసక్తికరమయిన విషయం.  షిర్డీసాయి ట్రస్ట్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్   ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

గాడ్గే మహరాజ్

నానా సాహెబ్ రాస్నే గారు గాడ్గే మహరాజ్ గారి జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమయిన విషయాన్ని వివరించారు.  దానినే మరలా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు మరొక్క సారి మనందరికి వివరిస్తున్నారు.  శ్రీ సాయిబాబావారి అనుగ్రహం పొందినవారిలో దామోదర్ రాస్నేగారు కూడా ఒకరు.  ఆయన కుమారుడయిన నానాసాహెబ్ రాస్నేగారి ఇంటికి ఒకసారి గాడ్గే బాబా వచ్చారు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List