28.05.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మా స్వస్థలం నరసాపురం నుండి హైదరాబాదు కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాను. ఈ కారణం చేత బ్లాగులో ప్రచురణలకు చాలా ఆలశ్యమవుతూ వచ్చింది. బాబా ఆశీర్వాదంతో నిజాంపేటలో ఫ్లాటు కొనుక్కొని క్రిందటి నెలలోనే గృహప్రవేశం కూడా అయ్యాము. ఇకనుంచి వీలువెంబడి బ్లాగులో బాబావారి కి సంబంధించిన లీలలు, తత్వం ప్రచురిస్తూ ఉంటాను.
అమెరికాలో సాయిదర్బార్ ను నిర్వహిస్తున్న బదరీ నరసిం హన్ గారు ప్రచురించే "ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" ఈ మాగజైన్ నుండి సాయిబాబా వారి లీలలు, ఇతర ఆధ్యాత్మిక విషయాలు శ్రీ షిరిడీ సాయి వైభవం పేరుతో ప్రచురిస్తాను. తెలుగులోకి అనువదించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన సాయిదర్బార్ యూ. ఎస్. ఏ.ఓఆర్గ్. (saidarbarusa.org) నిర్వాహకులు శ్రీ బదరీ నరసిం హన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ రోజు దీ గ్లోరీఆఫ్ షిరిడీసాయి పాతసంచిక అక్టోబరు 2009 వ.సంవత్సరం లోని ఒక బాబా లీల చదవండి.
శ్రీ షిరిడీసాయి వైభవం
మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు
శ్రీసాయి సత్ చరిత్ర ఒక మహిమాన్విత గ్రంధమని మన సాయి భక్తులందరికీ అనుభవమే. శ్రీ సాయి సత్ చరిత్ర, బాబా, వేరు కాదు. సాయి సత్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ప్రతీ మాట, పదం అన్నీ కూడా బాబా వారు స్వయంగా చెప్పిన మధుర వాక్కులు. సత్ చరిత్రను ప్రతీ రోజు పారాయణ చేసేవారు తమ సమస్యలకు బాబా వారి సమధానాలను కూడా సత్ చరిత్ర ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు. ఏదయినా సమస్య ఎదురయినప్పుడు కనులు మూసుకొని బాబాని మనస్పూర్తిగా ప్రార్ధించి పరిష్కారం చూపించమని చరిత్రలోని ఏదో ఒకపేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది.