Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 24, 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము

0 comments Posted by tyagaraju on 8:23 AM

                         
                                       

24.11.2012  శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ విష్ణుసహస్రనామం 6వ. శ్లోకం మరియు తాత్పర్యము:

శ్లోకం:  అప్రమేయో హృషికేశః పద్మనాభో మర ప్రభుః 

         విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధృవః ||


భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు.  ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు.  అందరికన్నా ఎక్కువ వయస్సు కలవాడు.  తానే ధృవమై స్థిరముగానున్నవాడు.     




                                                
జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము



సాయి బా ని స గారు చేప్పే వివరణను ఆలకించండి. 



శ్రీమద్భగవద్గీత 2వ.అధ్యాయము 22, 23 శ్లోకములు:

                             

ఏ విధముగా మానవుడు పాత వస్త్రములను వదలిపెట్టి, క్రొత్త వస్త్రములను ధరించునో, అట్లే ఈ జీవాత్మ కూడా పాత శరీరములను విడిచి క్రొత్త శరీరములను పొందును.  

ఆత్మ ఆయుధముల చేత గాని, అగ్నిచేత గాని, నీటిచేత గాని ఆఖరికి వాయువు చేత గాని నాశనము కాబడదు. 

           
24, 25 శ్లోకములు:

ఆత్మ చేదింపబడనిది, దహింపబడనిది.  ఆత్మ అన్నిచోట్ల వ్యాపించి యుండునది స్థిరమైనది.  ఓ! అర్జునా! అందుచేత ఆత్మను గురించి సంపూర్ణముగా తెలిసికొన్న తరువాత శోకింపతగదు.

26, 27 శ్లోకములు:  

ఓ! అర్జునా ఒకవేళ ఈ ఆత్మ కు కూడా చావుపుట్టుకలున్నవని నీవు భావిస్తూ ఉన్నచో దానిని గురించి నీవు శోకించుట తగదు. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించినవానికి జన్మము తప్పదు. అనవసర విషయములపై శోకింపతగదు.

శ్రీమద్భగవద్గీత: 4 వ.అధ్యాయము (జ్ఞాన, కర్మ, సన్యాసయోగ) 5, 6 శ్లోకములు: 

ఓ! అర్జునా! నీకు, నాకు ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు గడచిపోయినవి.  వాటినన్నిటినీ నీవెరుగవు. మన గత జన్మలగురించినవన్ని నాకు తెలుసును. ఈ జరిగినవాటికన్నిటికీ కూడా నేను అతీతుడను. ఆత్మ వలె నాకు ఆది అంతములు లేవు.  నాయోగ శక్తిచే నేను వివిధ రూపాలలో అన్నిటినీ నాస్వాధీనములో ఉంచుకొందును. 

శ్రీసాయి సత్ చరిత్ర 36వ. అధ్యాయములో బాబా ఇదే విషయాన్ని శ్యామాకు ఇలా తెలియచేశారు "శ్యామా 72 జన్మలనుంచీ మనమిద్దరమూ ఒకరికొకరము  తెలుసుకొని ఉన్నాము. నేను నిన్నెపుడైనా బాధించిన విషయము  ఒక్కటైనా  నువ్వు గుర్తుకు తెచ్చుకొనగలవా?  

మరలా శ్రీ సాయి సత్చరిత్ర 3వ అధ్యాయములో బాబా తన భక్తులకు ఇట్లు చెప్పిరి.  

జనులందరి యొక్క ఇంద్రియములను, మనసును, శరీరాన్ని నా అధీనములో నుంచుకొని పాలించువాడను నేనే.  సమస్త జీవరాసులన్నిటియందు నేను వ్యాప్తి చెంది యున్నాను. ఈ విశ్వములోని ప్రతీదీ కూడా నా ఆజ్ఞచేతనే చలించును. జరిగేవాటినన్నిటికి కారణభూతుడను నేనే. నేనే జగన్మాతను.  త్రిగుణాత్మకుడను నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే. 

శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములవారు అర్జునునకు ఉపదేశించిన ఇదే విషయాన్ని ఈ కలియుగంలో బాబా మనకందించారు.   

ఇంతవరకు నేను భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మకు ఆది అంతము లేదనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని గురించి నాకు అర్ధమైనది మీకు వివరిస్తాను. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


Friday, November 23, 2012

శ్రీసాయితో మధురక్షణాలు - 5

0 comments Posted by tyagaraju on 6:00 AM






23.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరలా సాయితో మధురక్షణాలు --  చదివి క్షణ క్షణం స్మరించుకుంటూ ఉండండి.  ఆకాలంలో మీరు ద్వారకామాయిలో ఉన్నట్లుగా ఊహించుకొని ఇప్పుడు చెప్పబోయే దృశ్యాన్ని కూడా కనులారా తిలకించండి. మనమంతా బాబాకు చెందినవారమని భావించుకోండి. 

ఓం సాయిరాం
                 

Thursday, November 22, 2012

జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 1

0 comments Posted by tyagaraju on 6:35 AM



                                     
                                                

22.11.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                             
                                   
                                    
శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం 4వ. శ్లోకం మరియు అర్ధం:

శ్లోకం:  సర్వ శ్శర్వ శ్శివ స్ఠాణు ర్భూతాధిర్నిధిరవ్యయః    

         సంభవో భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః  || 

సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభము కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమై పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపటకు సమర్ధుడైనవాడు, ఆట్లు సృష్టివైభమునకు కారణమైన వానికి నమస్కారము.  

Wednesday, November 21, 2012

శ్రీసాయితో మధుర క్షణాలు - 4

0 comments Posted by tyagaraju on 7:06 AM

  
                                   
 

21.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                             

శ్రీవిష్ణు సహస్రనామం 3వ.శ్లోకం:

   యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 
   
   నారసిం హవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః  ||

తాత్పర్యము: ఆయనే యోగము, యోగులకు నాయకుడైయున్నవాడు. మూల ప్రకృతిలేక మాయగా వచ్చినవాడు.  పురుషులకు ఈశ్వరుడైనవాడు. నృసిం హ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీదేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తిచే తెలియబడినవాడు. 

యోగమనగా అన్నిలోకములలోను ప్రజ్ఞ మేల్కొని యుండుట. అన్నమయము (భౌతికము) ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయమను కోశముల యందన్నిటియందు జీవులు సమానముగా మేల్కొని యుండు స్థితి.  దీనిని సాధించుకొనుటకే యోగాభ్యాసము ఆవశ్యకము.  అట్టి యోగాభ్యాసము ప్రారంభింపవలెనన్న కోరిక పరమాత్మనుండియే మనయందు పుట్టుచున్నది.  కనుక పరమాత్మయే యోగమను పేర కూడా తెలియబడుచున్నాడు.  

అందుచేత యోగసాధన చేయువారికి, ప్రారంభించువారికి నాయకుడు లేక మార్గ దర్శకుడు నారాయణుడే అగుచున్నాడు. యోగాభ్యాసము మొదట ఒక సద్గురువునొద్ద ఉపదేశము పొందవలెను అట్లు ఉపదేశించు గురువు ద్వారా యోగము నారాయణుడే ఉపదేశించుచున్నాడు.  అనగా గురువు నుండి శిష్యులలోనికి నారాయణుడే ప్రవేశించుచున్నాడు.  


సాయితో మధురక్షణాలు ప్రతిక్షణం తలుచుకుంటూ ఉండండి.

శ్రీసాయితో  మధుర క్షణాలు - 4
నాయెందవరి దృష్టో వారియందే నాదృష్టి
 
మీరు ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే రాత్రి పొద్దుపోయిన సమయంలో కూడా కొంత మంది భక్తులు ధ్యాన నిమగ్నులై ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం.  కొత్తగా ధ్యానం ప్రారంభించే భక్తులు ద్వారకామాయిలో ఉన్న ఆయన చిత్రపటం ముందు కూర్చొని ఆయన రూపాన్ని ధ్యానిస్తారు.  ఈ బాబా చిత్రపటం వెనుక శ్రీ డీ.డీ.నిరోయ్ గారికి సంబంధించిన ఒక లీల ఉంది. శ్రీ డీ.డీ. నిరోయ్ కామూ బాబా ( ముంబాయి గిర్ గావ్ లో ఉండే  సాధువు) కు భక్తులు. బాబా కరుణా దృష్టిని ప్రసరిస్తూ రాతి మీద కూర్చొని ఉన్న చిత్రపటాన్ని తయారుచేయించారు.  దానిని నలుగురు మనుషుల సాయంతో ఆయన గిర్గావ్ కు తీసుకొని వచ్చి తన గురువుగారికి సమర్పించారు.  కామూ బాబా ఆ చిత్రపటాన్ని చూసి ఎంతో ప్రశంసించారు.  కాని, దానిని తీసుకోవడానికి నిరాకరించారు.  దానిని షిరిడీ తీసుకొని వెళ్ళి ద్వారకాయాయిలోని సభామండపం (హాలు) లో పెట్టమని కామూ బాబా నిరోయ్ గారికి చెప్పారు.

నిరోయ్ గారు నిరాశపడి గురువుగారి పాదాలవద్ద కూర్చొని "ఈ చిత్రాన్ని వేయించడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. దానిని ఫ్రేములో బిగించడానికి నెలన్నర పట్టింది.  ఖర్చు గురించి నేనాలోచించను.  మీరేమో దీనిని తీసుకోనంటున్నారు" అన్నారు.  ఒక భక్తునిగా నిరోయ్ గారు ఎటూ తేల్చుకోలేక ఆందోళనలో పడ్డారు, కాని, గురువు జ్ఞాని,  ఆయనకు అంతా తెలుసు.  "దానిని తిరస్కరించడం అన్నది కాదు ప్రశ్న.  నువ్వు దానిని షిరిడీకి తీసుకొని వెళ్ళాలన్నదే నా ప్రగాఢమైన వాంచ.  అక్కడ వేలకొద్ది భక్తులకు  ప్రార్ధించుకొనే భాగ్యం కలుగుతుంది." అని ప్రశాంతంగా జవాబిచ్చారు.

ఆవిధంగా ఆ పటం ద్వారకామాయిలోని సభామండపంలో ప్రతిష్టింపబడింది.  జరగబోయేదానిని ముందే ఊహించి కామూబాబా చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయనే కనక ఆవిధంగా చెప్పి ఉండకపోతే ఈనాడు మనకు ద్వారకామాయిలో అంత అందమైన బాబా చిత్రపటాన్ని దర్శించుకొనే భాగ్యం కలిగి ఉండేది కాదు. 

బొంబాయి చివరి ప్రాతమయిన అంధేరీ ప్రధాన రహదారిలో పుణ్యపురుషుడయిన కామూబాబా నివాసం.  రోడ్డ్లుకు ప్రక్కనున్న బంగళాలో ఒక పార్సీ కుటుంబం నివసిస్తోంది. కామూబాబా గారు అక్కడ నివసిస్తూ ఉండేవారు.  పార్సీ కుటుంబంవారు కామూబాబా భక్తులు.  వారు ఆయన సేవ చేసుకొంటూ ఉండేవారు.  ప్రాపంచిక సమస్యల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పుకొని ఆయన ఆశీర్వాదాలను పొందటం కోసం చాలా మందిఅయన దర్శనం కోసం వస్తూ ఉండేవారు.

చెన్నైకి చెందిన లాల్ చంద్ అనే భక్తుడు కామూబాబా వల్ల తాను పొందిన అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.  1952 నుంచి ఆయన షిరిడీ వెడుతూ ఉండేవారు.  మానవమాత్రునిలో దైవిక శక్తులు నిక్షిప్తమయి ఉండటం, ఆయనను దానివైపు మొగ్గు చూపేలా చేసింది. కామూబాబా వద్దకు వెళ్ళి, ఆయన దర్శనం చేసుకోవాలనే కోరిక ఉదయించింది ఆయనలో.  కాని మనసులో ఒకవిధమయిన సంశయాత్మకమయిన భావనకూడా ఉంది.  స్వచ్చమయిన పుణ్య పురుషుడి యొక్క దర్శన భాగ్యం కలుగ చేయమని ప్రార్ధించుకొన్నారు. ఆసమయంలో ఆయనకు తన సమస్యలు చెప్పుకొని సమాధానం పొందటానికి ఎటువంటి సమస్యలూ లేవు. 

1959 వ సంవత్సరంలో  ఆయన బొంబాయిలో ఉన్నపుడు ఒకరోజు సాయంత్రం 5 గంటలకు కామూబాబాను దర్శిద్దామనుకొన్నారు.

సాయంత్ర సమయంలో రద్దీగా ఉంటుందని కాస్త ముందుగానే వెడదామనుకొని ఆఫీసునుంచి బయలుదేరబోతుండగా ఫోన్ వచ్చింది.  ఆఫోన్ యొక్క సారాంశం ఏమిటంటే ఆయన ఒక వ్యక్తికి అప్పుయిచ్చాడు.  అతను యిప్పుడు మోసపూరింతంగా తానా అప్పును తీర్చటల్లేదని చెప్పడంతో ఆయన మనసు మార్చుకొని ఈ విషయమేదో తేల్చుకొందామనే ఉద్దేశ్యంతో కామూ బాబా వద్దకువెళ్ళడం వాయిదా వేద్దామనుకొన్నారు. కాని మెరుపులా ఆయన మదిలోకి ఇలా అనిపించింది "ఎందుకు చింతిస్తావు? నేనా విషయం రేపు చూసి చక్కబరుస్తాను"

ఆయన తన స్నేహితునితో కలసి కామూబాబా దర్శనానికి వెళ్ళారు.  200 మంది భక్తులున్న వరుసలో చోటు దొరికిం ది.  ఆయన స్నేహితునితో కలసి ఎక్కడో చివర ఉన్నారు.  ఆయన కామూబాబా వద్దే ఎంతో ఆత్రుతతో చూస్తూ, అదే సమయంలో షిరిడీసాయిబాబా వారిని కూడా స్మరించుకుంటున్నారు.  5, 6 గురు భక్తులను చూసి, వారి సమస్యలకు సమాధానాలు చెప్పిన తరువాత బాబా వారివైపు చూసి చేయి ఊపారు. ఎంతోమంది తనముందు వేచి చూస్తున్నా వారినందరినీ కాదని కామూబాబా ఆయనను పిలిచారు.  బహుశా తన సమస్య, తన ఆత్రుత కామూబాబాకు చేరి ఉండవచ్చు.  ఆయన వరుసలోనుంచి బాబావద్దకు వెళ్ళారు.  కామూబాబా, చిరునవ్వుతో "నీకేదైతో రాదని అనుకుంటున్నావో అదినీకు లభిస్తుంది.  చింతించకు" అన్నారు.  కామూబాబా ఆశీర్వాదాలు తీసుకొని ఆయన తిరిగి వచ్చారు.  మరునాడు ఆయన ఉదయం 11 గంటలకు అఫీసుకు చేరగానే, ఆయన ఎక్కౌంటంట్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఆయనకు ఒక బేరర్ చెక్కు బ్రోకర్స్ వద్దనుంచి వచ్చిందనీ దానిని అయన ఖాతాలో జమ చేసినట్లుగా చెప్పారు.  యిది కామూబాబాగారు చేసిన అద్భుతం మరియు ఆయన అనుగ్రహం.

శ్రీసాయిలీల మాసపత్రిక
డిసెంబరు 1981
లాల్ చంద్  కె.బుల్భాందినీ - తమిళ్ నాడు
(మరికొన్ని మధురక్షణాలు ఇంకా ఉన్నాయి....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 




Tuesday, November 20, 2012

శ్రీసాయితో మధురక్షణాలు - 3

0 comments Posted by tyagaraju on 6:15 AM


                                                 

20.11.2012  మంగళవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్బుతమైన మధుర క్షణం.  అన్నీ మధుర క్షణాలే. 

ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 2వ. శ్లోకం, మరియు తాత్పర్యం 

                                  

శ్లోకం 2.     పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః    

                 అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ || 

తాత్పర్యము: పరిశుధ్ధమైన ఆత్మ కలవాడు, గొప్ప ఆత్మయైనవాడు, మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్ష్యముగా నున్నవాడు, తరుగుట యనునది లేనివాడు, దేహమునందున్న ప్రజ్ఞలన్నింటినీ గమనించువాడు, ఉపాధియందుండి తెలిసికొనువాడు, నాశనము లేనివాడు కదా !  (అక్షరః = నాశనము లేనివాడు, ఏవచ = ఆవిధముగానున్నాడు కదా)  


శ్రీసాయితో మధురక్షణాలు - 3

నీ బిడ్డను పట్టుకో.....
                              
                                           
1945 సెప్టెంబరు న శ్రీ టీ.ఎల్.ఎస్. మణి అయ్యర్ గారికి అమ్మాయి జన్మించింది.  ఆమెకు "సాయి చంద్ర" అని పేరు పెట్టారు.  మిగతా కుటుంబాన్ని రక్షించినట్లే శ్రీసాయి బాబా ఈపాపను కూడా రక్షించారు.  25, జనవరి 1946 వ.సంవత్సరంలో మణి అయ్యర్ గారు  ఒకరోజు వేకువజామున 4 గంటలకు లేచి యింటినుంచి బయలుదేరడానికి సిద్ధమయారు. తను పడుకున్న మంచం మీద అయిదు నెలలున్న తనపాప రెండు అడుగుల ఎత్తు ఉన్న మంచం మీద ఒక్కతే నిద్రపోతూ ఉంది. మంచానికి రెండువైపులా ఎటువంటి రక్షణా లేదు.   ఆయన మరొక ప్రక్కన నిద్రపోతున్న తన భార్యతో "పాపను జాగ్రత్తగా చూసుకో" అంటూ  బయటకువెళ్ళిపోయారు.  ఆయన భార్య అలాగే అని సమాధానమిచ్చి వెంటనే నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఉన్నతల్లికి (కుఝంధైయ యై ఏదు) " నీ పాపను పట్టుకో" అనే మాటలు వినపడటంతో ఉలిక్కిపడి హటాత్తుగా లేచింది.  అక్కడ ఆమాటలు అన్నవారెవరూ కనపడలేదు.  పాప మంచం మీదనుంచి కిందకి వేలాడుతూ పడిపోవడానికి సిధ్ధంగా ఉంది.  ఆమె పాపను పట్టుకోవడానికి ముందుకు జరిగినపుడు భూమిలోనుంచి రెండు చేతులు వచ్చి పసిపాప పడిపోకుండా రక్షణగా ఉండటం కనిపించింది.  తల్లి మంచి గాఢనిద్రలో ఉన్నపుడు పాపని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నది ఎవరు? స్వయంగా ఆసాయినాధుడే.  ఎల్లపుడు మనందరినీ ప్రేమించే  తల్లి, తండ్రి.  తల్లి, ఆపాపని తన చేతులలోనికి తీసుకోగానే, అంతవరకు సాయిచంద్ర పడిపోకుండా రక్షణగా ఉన్న ఆచేతులు అదృశ్యమయ్యాయి.  
  
బావిలో పడిన మూడు సంవత్సరాల బాలిక శాంతిని, మేడమీదనుంచి పడిన రెండు సంవత్సరాల బాలుడు నాచ్నేను  రక్షించినట్లుగానే బాబా ఆపాపను రక్షించారు. 

(1928 వ.సంవత్సరంలో సాయినాధ్ నాచ్నే  రెండు సంవత్సరాల బాలుడు. ఒకరోజున ఆపిల్లవాడు పరిగెడుతూ ఉండగా ప్రమాదవశాత్తు మేడమీదనుంచి పడిపోయాడు.  కింద పెద్దరాళ్ళగుట్ట, చెత్త ఉంది.  నాచ్నే  పరుగెత్తుకుని వెళ్ళి చూసేటప్పటికి అతని కుమారుడు ఎటువంటి గాయాలు, దెబ్బలు లేకుండా నిల్చుని ఉన్నాడు. నాచ్నే  తన తండ్రితో "భయపడద్దు, బాబా నన్ను పైకి లేపారు" అన్నాడు. 

సాయిసుధ - సావనీర్ 1946 ప్రచురణ నుంచి సమాచారం .


(యింకా ఉన్నాయి మధురక్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List