08.02.2023 బుధవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –14 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ
యోగము శ్లోకమ్ – 32
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమమ్ పశ్యతి యోర్జున
సుఖం వా యది వా దుఃఖమ్ యోగీ పరమో మతః
ఓ అర్జునా ! సర్వ ప్రాణులను తనవలె (తనతో)
సమానముగా చూచువాడును, సుఖము గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగా) చూచువాడును, (ఇతరుల
సుఖదుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్టుడు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్
- 37
బాబా సర్వ భూతములయందు, భగవద్భావాన్ని కలిగి యుండేవారు.
శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయం – 3
బాబా అన్న మాటలు – “ఈ దృశ్యప్రపంచమంతా
నా స్వరూపం. చీమలు, దోమలు, పురుగు, పుట్ర,
రాజు, పేద, సకల చరాచర విశ్వమంతా నారూపం”.