Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 14, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (8 )

0 comments Posted by tyagaraju on 8:44 AM



14.01.2012 శనివరము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి. బా.ని.స. డైరీ - 1994 8 వ.భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (8 )


01.03.1994

నిన్నటిరోజున భార్య పిల్లల మీద విసుగు కలిగినది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఈసంసారము మధ్య ఉంటు సంసారముపై వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపించిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది. వాటి వివరాలు.

"జీవితము అనే రైలు బండి స్టేషన్ లో ఆగినది. నేను చికాకుతో రైలు పెట్టెనుండి దిగి ప్లాట్ ఫారం మీద తిరుగుచున్నాను.


యింతలో గార్డు పచ్చ జండా చూపించినాడు.

రైలు కదలసాగినది. వేగము పుంజుకోసాగింది. నేను రైలు ఎక్కాలా వద్దా అనే ఆలోచనలతో ప్లాట్ ఫారం మీద నిలవడిపోయినాను. నాముందునుండి రైలు వేగముగా వెళ్ళిపోసాగినది. రైలు ఎక్కాలని మనసులో కోరిక ఎక్కువ కాసాగినది. రైలు వెనకాల పరిగెత్తుతూ గార్డు పెట్టెలోనికి ఎక్కినాను. గార్డు తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు.

నన్ను చిరునవ్వుతో తన సీటు ప్రక్కన కూర్చుండపెట్టుకొన్నారు. ఆయన అంటారు "తోటి ప్రయాణీకులపై కోపముతో నీయిష్ఠము వచ్చిన స్టేషన్ లో దిగరాదు. నీ ఆఖరి స్టేషన్ వచ్చేవరకు నీవు ప్రయాణము చేయక తప్పదు. నీ స్టేషన్ లో నీవు దిగిన తర్వాత నలుగురు కూలీలు నీ ఋణము తీర్చుకోవటానికి, నిన్ను మోయటానికి వస్తారు. కాని నీవు పరుండే శవపేటిక మూత వేయటానికి మాత్రము ఎవరూ తమ డబ్బు యిచ్చి మేకులు కొనరు. అందుచేత యిప్పుడే నీకు కావలసిన మేకులును నా దగ్గర కొని నీదగ్గర ఉంచుకో. రైలుదిగిన తర్వాత అంతిమ యాత్రకు సిధ్ధపడు." ఒక్కసారిగా మెలుగువ వచ్చినది. విధమైన కలకు అర్ధము గ్రహించినాను. శ్రీ సాయి, సంసారము మీద వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపినందులకు కృతజ్ఞతలు చెప్పినాను.

03.03.1994

నిన్నటిరోజున గుండెనొప్పితో చాలా బాధపడినాను. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా ఆరోగ్యము బాగుపడటానికి సూచనలు యివ్వమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. 1) నీ జీవితములో నీ మనసుకు ఆందోళన కలిగించిన ముగ్గురుకు నీవు దూరంగానే యుంటున్నావుకదా. యింకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించుతావు. వాళ్ళను మర్చిపోయి ప్రశాంతముగా జీవించు. 2) నీ యింటి వ్యవహారాలులో ఎక్కువగా ఆలోచించకు. జరిగేది జరగక మానదు. 3) నీ ఆరోగ్యము కోసము సాత్విక ఆహారము తిను. 4) నీ పని డబ్బు సంపాదించి నీ కుటుంబ సభ్యులకు యివ్వటము మాత్రమే. ఖర్చు విషయము నీకు అనవసరము. 5) నీ బంధువులతో గొడవలు పడటము మాని వేయి. 6) రోజు భగన్ నామస్మరణ చేస్తూ జీవించు.

(యంకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు





Thursday, January 12, 2012

సాయి.బా.ని.స. డైరీ - 7 (1994)

0 comments Posted by tyagaraju on 4:20 PM



సాయిబంధువులకు అందరకు సంక్రాంతి శుభాకాంక్షలు



13.01.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1994 - 7 వ భాగాన్ని చదువుకుందాము



సాయి.బా.ని.స. డైరీ - 7

25.02.1994

నిన్నటిరోజున శ్రీ ఆర్థర్ ఆస్ బరన్ యింగ్లీషులో వ్రాసిన "ది యింక్రెడిబల్ సాయిబాబా" అనే పుస్తకాన్ని తెలుగు భాషలో అనువాదము పూర్తిచేసి శ్రీ సాయి పాదాలకు అర్పించినాను.


రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని ఆశీర్వచనాలు ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి, నాకు త్రాగటానికి కమ్మటి మజ్జిగ గ్లాసు నిండ యిచ్చినారు.

నేను సంతోషముగా మజ్జిగ త్రాగినాను. వ్యక్తి అన్నారు. నా కధలు వ్రాస్తున్నపుడు నీ చేతి వేలు తెగినపుడు ఎవరి దగ్గరకు మందుకోసము వెళ్ళవద్దు. నీ తెగిన వ్రేలిని నోటిలో పెట్టుకొని చప్పరించు. నా కధలు వ్రాయటము పూర్తి అయిన తర్వాత నీవు పండరీపూర్ యాత్ర చేయనవసరము లేదు. పండరీనాధుడు నీ గుండెలలో గూడు చేసుకొని యుంటాడు. వ్యక్తి మాటలు వింటూయుంటే సంతోషము కలిగి, నిద్రనుండి తెలివి వచ్చినది. శ్రీ సాయికి నమస్కరించినాను.

26.02.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము మీద కొత్త పుస్తకాలు వ్రాయాలని కోరిక కలిగినది. "కొత్త పుస్తకాలు వ్రాయటానికి అనుమతిని ప్రసాదించమని " రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "నీ ఆఫీసులోని గాలి గొట్టాలలో అడ్డంకులు, యిబ్బందులు ఉన్నాయి, ముందు వాటి సంగతి చూసుకొని తర్వాత కొత్త పుస్తాకాలు వ్రాయి" శ్రీ సాయి విధముగా నా గుండె జబ్బు గురించి హెచ్చరించి నా ఆరోగ్యము కుదుటపడిన తర్వాత కొత్త పుస్తకాలు వ్రాయమని ఆజ్ఞాపించినారు అని భావించినాను.

పి.ఎస్. 17.05.1996 నాడు నా గుండెకు బై పాస్ సుర్జరీ జరిగినది.

28.02.1994

నిన్న రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి మంచి విషయాలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి సినీ నటుడు కాంతారావు రూపములో దర్శనము యిచ్చి అన్నారు.

"నేను జీవితములో కష్ఠపడి సినీరంగములో ప్రవేశించి బాగా డబ్బు సంపాదించినాను. అజాగ్రత్తవలన డబ్బు అంతా పోగొట్టుకొన్నాను. రోజున కారులో లిఫ్ట్ యిస్తేనే బయటకు వెళ్ళే స్థితిలో ఉన్నాను. జీవితములో కష్ఠాలు, సుఖాలు అనుభవించిననాడే అది నిండు జీవితము అగుతుంది. శ్రీ సాయి విధముగా హెచ్చరిక చేస్తు జీవుతములో క్రమశిక్షణతో యుండి జాగ్రత్త పడాలని మరియు కష్ఠ సుఖాలను సమ దృష్ఠితో చూడాలని సూచించినారు.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Wednesday, January 11, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (6)

0 comments Posted by tyagaraju on 5:41 PM


12.01.2012 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 6 వ. భాగము చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ - 1994 (6)

17.02.1994

నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి సూచనలు" యివ్వమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అన్నారు.

1) మనిషి జీవితములో సంతోషము కలిగించే వివాహాది శుభకార్యాలు, విచారము కలిగించే మరణమును సమదృష్ఠితో చూడగలగటము.

2) వృధ్దాప్యములో ధన, ధార, సంతానములపై వ్యామోహము విడనాడి, ఏకాంత జీవితము గడుపుతూ పరమాత్మ పిలుపుకోసము ఎదురు చూడగలగటము, నిజమైన ఆధ్యాత్మిక శక్తికి ఉదాహరణలు.

18.02.1994

నిన్నటి రోజు గురువారము శ్రీ సాయినామము స్మరించుతూ రాత్రి నిద్రకు ముందు భగవంతుని శక్తి గురించి చెప్పమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "కాల చక్రములో దేవుని పేరిట వెలిసిన గుళ్ళు గోపురాలు వాటి వాటి అదృష్ఠానుసారము వైభవమును అనుభవించి కాల గర్భములో కలసిపోతాయి. కాల చక్రానికి అతీతమైన భగవంతుని శక్తికి నాశనము లేదు. అందుచేత గుళ్ళుగోపురాలను నమ్ముకొనేకంటే నాశనము లేని భగవంతుని శక్తినే నమ్ముకో".

19.02.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "జీవితానికి పనికి వచ్చే మంచి సలహాలను చెప్పుతండ్రీ" అని వేడుకొన్నాను. (1) శ్రీ సాయి ట్రాఫిక్ పోలీసు రూపములో దర్శనము యిచ్చి అంటారు "జీవితములో నాలుగు రోడ్ల జంక్షన్ వచ్చినపుడు - రోడ్డుమీదగా ప్రయాణము చేయాలి అనే సందిగ్ధ అవస్థ కలిగినపుడు శ్రీ సాయి అనే ట్రాఫిక్ పోలీసు సలహా పాటించి ముందుకు పయనించు.

2) ఆధ్యాత్మిక రంగములో అడుగు పెట్టినవాడు సన్యాసము తీసుకోవాలని చాలా ఉత్సాహ పడతాడు, తీరా సన్యాసము తీసుకొన్న తర్వాత భోజనము కోసము తన యింటిముందే నిలబడవలసి యుంటుంది. అందుచేత సన్యాసము తీసుకోకుండ గృహస్థ ఆశ్రమములోనే యుంటు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయటము ఉత్తమము.

20.02.1994

నిన్నటిరోజు ప్రశాంతముగా గడచినది. రాత్రి కలలో శ్రీ సాయి యిచ్చిన సందేశము "నీ యింట జామి చెట్టు కాయలను ప్రక్కయింటి పిల్లలు కోస్తున్నారని వాళ్ళను దండించటానికి సిధ్ధపడుతున్నావే మరి నీవు చేస్తున్న పని ఏమిటి? దొంగ లెక్కలు వ్రాసి యితరుల సొమ్ము దొంగిలించుతున్నావే - యిది ఎక్కడి న్యాయం !

24.02.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు.

1) జాతకాలు చూసుకొని వివాహము చేసుకొని 25 సంవత్సరాలు కాపురము చేసి, మాట పట్టింపులకు విడాకులు తీసుకొన్న దంపతుల పిల్లలు కొందరు ప్రేమ వివాహాలు చేసుకొని మూడునాళ్ళు తిరగకుండా వారు విడాకులు తీసుకొంటే అటువంటివారి జీవితాలను ఏమనాలి. అటువంటి పరిస్థితికి కారణాలు ఏమిటి ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచనలలో గురువు (భగవంతుడు) అనుగ్రహము లేకపోవటము వలన యిటువంటి పరిస్థితులు కలుగుతాయి అనే భావన కలిగితే చాలు. ఆభావనే నిన్ను ఆధ్యాత్మిక రంగములో నడిపించుతుంది.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు






 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List