16.07.2014 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి తత్వం - 4వ.ఆఖరి భాగం
"శతృవులతో పోరాడుతున్నపుడు, స్నేహితులు, బంధువులు నీతో కలిసి పోరాడుతారు. కాని, మృత్యువుతో పోరాడుతున్నపుడు నీకెవరూ సహాయపడరు".
ఇదే విషయాన్ని మనం బాబా అంకిత భక్తుడయిన తాత్యా సాహెబ్ నూల్కర్ విషయంలో గమనించవచ్చు. తాత్యా వ్రణంతో బాధపడుతూ ఉండేవాడు. ఆసమయంలో అతని భార్యపిల్లలు షిరిడీలో లేరు. నూల్కర్ చిన్ననాటి స్నేహితుడు బాబా సలహా ప్రకారం సేవ చేయడానికి తాత్యా దగ్గర ఉన్నాడు.