03.11.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 2 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
2010వ.సంవత్సరములో
సాయిబానిస గారు ఒకనాటి
రాత్రి ధ్యానములో హైదరాబాద్
లోని పాత బస్తీలోకి
రాత్రివేళ వెళ్ళారు. ఆయన చార్
మినార్ దాటి వెళ్ళారు. అర్ధరాత్రివేళ ఆప్రాంతంలో
ఒక మిఠాయి దుకాణము
కనిపించింది. ఆ దుకాణము
బోర్డుమీద “మిఠాయి భండార్”
అని వ్రాసి ఉంది. సాయిబానిసగారు ఆకలితో
ఆ దుకాణములోకి వెళ్ళారు.