23.11.2021 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక గొప్ప అవధూత గురించి తెలుసుకుందాము.
శ్రీ సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి 1972 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
బాబా
శ్రీ త్రైలింగస్వామి
ఆంగ్ల
మూలమ్ : శ్రీ జి.ఎన్. పురందరే
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
మన దేశంలో అతి కొద్ది మందికే తెలిసిన తంజావూరులో ప్రముఖ అవధూతయిన సదాశివ బ్రహ్మేంద్ర గారి గురించి కొంతకాలం క్రితం తెలియచేశాను. ఈ రోజున వారణాశికి చెందిన మరొక గొప్ప అవధూత శ్రీ త్రైలింగస్వామి గారి గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన రెండువందల సంవత్సరాలకు పైగా జీవించారు. 17 - 18 శతాబ్దాలలో ఆయన వారణాశిలో సుప్రసిధ్ధుడు.
ఆయన తనకున్న అతీంద్రియ శక్తుల ద్వారాను. సిద్ధులద్వారాను ఎన్నో అధ్భుతాలను చేసారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ లో ఆయన చేసిన అధ్బుతాలు బాగా ప్రసిధ్ధి చెందాయి.