30.03.2019 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –17 వ.భాగమ్
YOU BRING US
JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
బాబాతో
సాన్నిహిత్యమ్ - డైరీ లో
ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 6
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411
8143626744
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం
చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని
పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
నాలుగు రోజుల క్రితం ఒక సాయి భక్తురాలు నాకు ఫోన్ చేసి ఇందులో ప్రచురించిన బాబాతో సానిహిత్యంలోని బాబా లీలలను వాట్స్ ఆప్ లో పెట్టవచ్చా అని అడిగారు. నేను సాయిబానిస గారిని అడిగి చెపుతానని చెప్పాను. ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన లోరెన్ వాల్ష్ గారికి మైల్ చేసి అడగమని చెప్పారు. నేను వెంటనే ఆవిడకు మైల్ ఇచ్చాను. ఆవిడ ఒకటి రెండు రోజులు ఆగండి, బాబాని అడిగి చెపుతాను అని చెప్పారు. ఆవిడ బాబాని వెంటనే బాబాని అడిగినట్లున్నారు. ఆవిడనుంచి ఈ రోజె మైల్ వచ్చింది. బాబా గారు దయతో అనుగ్రహించి అనుమతిని ఇచ్చారని నాకు మైల్ ఇచ్చారు. త్వరలోనే వాట్స్ ఆప్ లో సాయిభక్తులందరి కోసం ఈ అనుభవాలు ప్రచురింపబడతాయి. బాబాని అడిగితే ఏదీ కాదనరు. బాబా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా అనుగ్రహించారు.
ఓమ్ సాయిరామ్
ఓమ్
సాయిరామ్
ఒక
అజ్ఞాత భక్తుడు వివరించిన లీల
భారతదేశంనుండి
విదేశానికి ప్రయాణమవడానికి కొద్ది రోజుల ముందు నేను షిరిడీ వెళ్ళాను. నేను షిరిడీ వెళ్ళడం అదే
మొదటిసారి. నాకు
బాబా దర్శనం బ్రహ్మాండంగా అయింది. నేను షిరిడీనుంచి తిరిగి వచ్చే హడావిడిలో సాయి సత్ చరిత్రను కొనడం
మర్చిపోయాను.
విదేశ
ప్రయాణానికి సామాను సద్దుకునే సమయంలో సాయి సత్చరిత్రను కొనుక్కునే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు నాకు చాలా బాద కలిగింది.
నేను
ఎక్కవలసిన ఫ్లైట్ సాయంత్రం. అందువల్ల
నేను ఉదయాన్నే హాస్టల్ గదిని ఖాళీ చేసేసాను. నాకు వీడ్కోలు చెప్పడానికి
కొంతమంది స్నేహితులు వచ్చారు. వారు నాకోసం టాక్సీని మాట్లాడారు.
అందరం ఒకరికొకరతం వీడ్కోలు చెప్పుకున్న తరువాత, నేను నాసామానంతటినీ టాక్సీలోకి సద్దేసి, ఫ్రంట్
సీటులో కుర్చున్నాను.
ఇంతలో నన్ను పేరుపెట్టి ఎవరో పలవడం వినిపించింది. ఎవరా అని బయటికి చూసాను. ఒకమ్మాయి నావైపు పరుగెత్తుకుంటూ
వచ్చి ఇది తీసుకెళ్లడం మర్చిపోయారంటూ సాయి సత్ చరిత్ర పుస్తకాన్ని నాచేతిలో
పెట్టింది.
ఈ
అమ్మాయి కూడా నేను ఉంటున్న హాస్టల్ లోనే ఉంటోంది. ఎన్నో సందర్భాలలో మేమిద్దరం
మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కాని ఎప్పుడూ నేను సాయి సత్ చరిత్రను కొనుక్కోవాలనే విషయం ఆమెకు చెప్పలేదు. ఆ తరువాత నాకు తెలిసినదేమిటంటె ఆ
అమ్మాయి కూడా బాబా భక్తురాలే. నాకు సాయి సత్ చరిత్రను అందించడానికి బాబా ఆమెను వినియోగించి నాకోరికను
తీర్చారు. విదేశంలో
ఉన్నప్పుడు నేను పారాయణ చేసుకోవడానికి నాకు అన్ని విధాలా సహాయపడటానికి బాబా నాకు
సాయి సత్ చరిత్రను అందించినందుకు నేనెంతో ఆయనకు ఋణపడి ఉన్నాను.
మరొక
అధ్భుతమయిన లీల… భారతీ శ్యామ్ బెంగళూరు
1993 వ.సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా సాయి సత్
చరిత్ర చదివాను. అప్పటినుంచి
బాబా నాజీవితంలో ఒక భాగమయ్యారు. నాకు బాబా ఒక అధ్భుతమయిన లీలను చూపించి, అప్పటివరకు
ఒక అవరిచితునిలా ఉన్న ఆయన నన్ను తన
మార్గంలోకి లాక్కున్నారు.
ఒక రోజు
రాత్రి 10.30 కు నా భర్త శ్యామ్ కు పంటినొప్పి మొదలయి
విపరీతమయిన బాధతో నిద్రపోలేకుండా ఉన్నారు.
సాయి చేసే అధ్బుతాలను పరీక్షించే సమయం ఆసన్నమయిందని
నాకనిపించింది. చిటికెడు
ఊదీ తీసుకుని నీళ్ళలో కలిపి, “బాబా నాభర్తకు పంటినొప్పిని
తగ్గించి ప్రశాంతంగా నిద్ర పట్టేల చేయి” అని సాయిని
ప్రార్ధించి, ఆనీటిని త్రాగించాను.
అప్పటికే
రాత్రి ఒంటిగంట అయింది. ఆసమయంలొ
డాక్టర్స్ కూడా ఎవరూ ఉండరు. నాభర్తకు పంటినొప్పి చాలా బాధాకరంగా ఉంది. ఆసమయంలోనే బాబా ఊదీ కలిపిన
నీటిని త్రాగిద్దామనే ఆలోచన అకస్మాత్తుగా నామదిలో మెదిలింది. ఆ వెంటనే ఊదీ కలిపిన నీటిని త్రాగించాను.
ఊదీ
కలిపిన నీరు చాలా అధ్భుతంగా పనిచేసింది. తాగిన పది నిమిషాలలోనే
నాభర్తకు గాఢ నిద్ర పట్టింది. ఉదయానికల్లా పంటినొప్పి మాయమయిపోయింది. ఇదే నా మొదటి అనుభవం. అప్పటినుంచి బాబా నాజీవితంలోకి
అడుగుపెట్టారు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)