18.03,2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భక్త
శబరి…???భక్తి పరీక్షా???
చెన్నై
నుండి శ్రీమతి కృష్ణవేణిగారు 15వ. తీరీకున ఒక
అనుభవాన్ని ఈ మెయిల్ ద్వారా పంపించారు. చాలా
అద్భుతమైన అనుభవం. ఇంకా విచిత్రమేమంటే ఈ
రోజు ప్రచురిస్తున్న ఈ అధ్బుతమైన లీలకు
బాబా వారు మరికొంత సమాచారం
కూడా ఇమ్మని నాకు సూచించారు.
అది ఏవిధంగా ఇచ్చారన్న విషయాన్ని ఈ లీల పూర్తయిన
తరువాత వివరంగా ఇస్తున్నాను.*** అది
కూడా చదవండి. ఈ లీల ప్రచురించడానికి
కూడా బాబావారి అనుగ్రహం ఏ విధంగా ఇచ్చారో మనం గ్రహించుకోవచ్చు.
శ్రీమతి కృష్ణ వేణిగారు పంపిన అనుభవం :
ఈ మధ్యనే జరిగిన ఒక లీల గురించి
మీకు చెబుతాను. ఈ
అధ్బుతమైన లీల క్రిందటి గురువారం
జరిగింది. మా
ఇంటిలో మేమంతా ప్రతిరోజు రాత్రి కూడా మామూలుగానే భోజనాలు
చేస్తాము. కొంత
మంది గురువారాలలో ఫలహారాలు చేస్తారు. నేను
గత మూడు వారాలుగా రాత్రి
చపాతీలు చేయడం మొదలు పెట్టాను. మొదటి
చపాతీ బాబా గారికి నైవేద్యంగా సమర్పించవచ్చని నా ఉద్దేశ్యం.
కాని క్రిందటి వారం చపాతీలు చేద్దామని
చూస్తే పిండి అయిపోయింది.
నేను ముందర గమనించలేదు.
అప్పటికే రాత్రి 7 గంటలయింది.