29.04.2021 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వాక్సిన్ వేయించుకోమన్న బాబా - వాక్సిన్ వేయించిన బాబా
ఈ
రోజు నా స్వీయ అనుభవాన్ని మీ అందరితోను పంచుకొంటున్నాను. నా అనుభవాన్ని చెప్పేముందు బాబా నానా సాహెబ్ చందోర్కర్
గారికి వాక్సిన్ వేయించుకోమన్న వృత్తాంతాన్ని వివరిస్తాను. --- త్యాగరాజు
నానాసాహెబ్ చందోర్కర్ బాబాను సందర్శించిన కొన్ని నెలల తరువాత అహ్మద్ నగర్ జిల్లాలో ప్లేగువ్యాధి వ్యాపించింది. నానాసాహెబ్ ప్రజలను ప్లేగు టికాలు వేయించుకోమని చెబుతూ ఉండేవాడు. కాని, ప్లేగు టికాలు వేయించుకొన్న తరువాత జ్వరము తగిలి మరణిస్తారనే భయంతో ప్రజలు ముందుకు రాలేదు. ప్రభుత్వోద్యోగులందరు ముందుగ టీకాలు వేయించుకొని దానివల్ల ఎటువంటి అపాయము లేదని చెబుతూ ప్రజలకు మార్గదర్శకులుగా ధైర్యము కలిగించాలని జిల్లా కలెక్టరు ఆజ్ఞాపించారు.