11.09.2014 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కలలలో శ్రీసాయి 6వ.భాగం క్రితం రోజునే అనగా 10వ.తారీకునాడే తయారు చేసి, ప్రచురించి కాస్త కరెక్షన్ చేశాను. పొరపాటు ఎక్కడ ఎలా జరిగిందో తెలియదు. డ్రాఫ్ట్ లో ఉండిపోయింది. ఈ రోజు గమనించాను అది నిన్నటి రోజున ప్రచురణ అవలేదని. బాబా వారిని క్షమించమని కోరుతూ ఈ రోజు ప్రచురిస్తున్నాను. ఓంసాయిరాం
కలలలో శ్రీసాయి - 7వ.భాగం
ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి తరువాయి భాగం వినండి.
ఆంగ్లమూలం : సాయిబానిస. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
ప్రతీవారు జీవితం ఒక రైలు ప్రయాణంవంటిది అని అంటూ ఉంటారు. మరి ఈప్రయాణానికి మొదటి స్టేషను ఆఖరి స్టేషను ఏది? అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఆరోజు రాత్రి బాబా నాకలలో నాతల్లి రూపంలో దర్శనమిచ్చి "నాగర్భం నుండి నీజీవిత ప్రయాణం ప్రారంభింపబడింది. నీమరణం తర్వాత తిరిగి వేరే తల్లి గర్భంలోకి చేరటమే నీజీవిత ప్రయాణానికి ఆఖరు మరల నూతన జీవితానికి ఆరంభం అని గుర్తుంచుకో" అన్నారు.
బాబా! నాకు నువ్వు అనేక సందేశాలను ప్రసాదించావు. మరి జ్ఞానమార్గంలో (ఆధ్యాత్మిక మార్గంలో) ప్రయాణించడానికి సలహాలు, సూచనలు ప్రసాదించు తండ్రీ అని బాబాను వేడుకొన్న రాత్రి బాబా నాకలలో ఒక రైతు కూలీగా దర్శనమిచ్చి "నీజీవితంలో అజ్ఞానమనే కలుపుమొక్కలను తీసివేయటం నావంతు. ఇక పొలంలో మిగిలిన జ్ఞానమనే మొక్కలను పెంచి పెద్ద చేయటం నీవంతు". ఈవిధంగా ప్రతి మానవుడు సద్గురు సహాయంతో మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, జ్ఞానదీపాలను వెలిగించుకొని దాని సహాయంతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలి.