Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 3, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 11 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 5:41 AM

 



03.06.2022  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 11 వ, భాగమ్

అధ్యాయమ్ – 7

కలలు -  వాస్తవాలు

(అధ్యాయమ్ 6 లో బాబాకు సంబంధించిన విషయం గాని అనుభవానికి సంబంధించిన విషయమేమీ లేనందువల్ల వదలివేయడం జరిగింది)

(ఒక్కొక్కసారి మనకు వచ్చేకలలు మనకు భవిష్యతులో జరగబోయే వాటిని సూచిస్తాయా?  ఒక్కొక్క సారి పదే పదే మనం ఏమేమి ఊహించుకుంటామో అటువంటి వాటికి సంబంధించినవే కలల రూపంలో రావడానికి ఆస్కారం ఉంది.   కాని కొన్ని కొన్ని మాత్రం మనం ఏమీ ఊహించుకోకుండానే వచ్చే కలలు మనకు జరగబోయే వాటిని సూచిస్తున్నట్లుగా ఉంటాయేమో అని వచ్చిన తరువాత గాని గ్రహించుకోలేము.  అటువంటి సంఘటనను సూచించినదే ఇప్పుడు ప్రచురింపబోయేది)

అక్టోబర్/నవంబరు, 1985, అని నాకు గుర్తు.  నేను మా చెల్లెలు అరుణ వివాహం నిమిత్తం తన జాతక చక్రాన్ని రాజ్ గురు నగర్ లో ఉంటున్న నారాయణరావు ఫడ్కే గారికి పంపించాను.  గురువారమునాడు ఒక అజ్ణాత వ్యక్తి మా సాయి మందిరానికి వచ్చి బాబాను  దర్శించుకుని బాబా ముందర పెద్ద ఇత్తడి దీపం వెలిగించి  వెళ్ళాడు.  ఎవరో దానిని బాబాముందు పెట్టారనీ, అది శుభసూచకమని అరుణ వివాహం నారాయణ ఫడ్కెతో జరగవచ్చని మా అత్తగారు అన్నారు.  ఆవారంలో నాకు ఒక కల వచ్చింది. 

Thursday, June 2, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 10 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 6:27 AM

 




02.06.2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః   


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 10 వ, భాగమ్

అధ్యాయమ్ –5

ఏప్రెల్ 11వ.తారీకు తరవాత మరలా బ్లాగులో శ్రీ సాయి దయాసాగరం తరువాయి భాగాన్ని ప్రచురిస్తున్నాను.  మే నెలలో నా రెండు కళ్ళకి కాటరాక్ట్ సర్జరీ అయినందువల్ల కళ్ళకి కాస్త విశ్రాంతినివ్వడం జరిగింది.  ముందుగా నా కళ్ళ ఆపరేషన్ కి బాబా కలిగించిన అనుభూతిని వివరిస్తాను.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List