03.06.2022 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 11 వ, భాగమ్
అధ్యాయమ్
– 7
కలలు
- వాస్తవాలు
(అధ్యాయమ్
6 లో బాబాకు సంబంధించిన విషయం గాని అనుభవానికి సంబంధించిన విషయమేమీ లేనందువల్ల వదలివేయడం
జరిగింది)
(ఒక్కొక్కసారి
మనకు వచ్చేకలలు మనకు భవిష్యతులో జరగబోయే వాటిని సూచిస్తాయా? ఒక్కొక్క సారి పదే పదే మనం ఏమేమి ఊహించుకుంటామో
అటువంటి వాటికి సంబంధించినవే కలల రూపంలో రావడానికి ఆస్కారం ఉంది. కాని కొన్ని కొన్ని మాత్రం మనం ఏమీ ఊహించుకోకుండానే
వచ్చే కలలు మనకు జరగబోయే వాటిని సూచిస్తున్నట్లుగా ఉంటాయేమో అని వచ్చిన తరువాత గాని
గ్రహించుకోలేము. అటువంటి సంఘటనను సూచించినదే
ఇప్పుడు ప్రచురింపబోయేది)
అక్టోబర్/నవంబరు,
1985, అని నాకు గుర్తు. నేను మా చెల్లెలు అరుణ
వివాహం నిమిత్తం తన జాతక చక్రాన్ని రాజ్ గురు నగర్ లో ఉంటున్న నారాయణరావు ఫడ్కే గారికి
పంపించాను. గురువారమునాడు ఒక అజ్ణాత వ్యక్తి
మా సాయి మందిరానికి వచ్చి బాబాను దర్శించుకుని
బాబా ముందర పెద్ద ఇత్తడి దీపం వెలిగించి వెళ్ళాడు.
ఎవరో దానిని బాబాముందు పెట్టారనీ, అది శుభసూచకమని అరుణ వివాహం నారాయణ ఫడ్కెతో
జరగవచ్చని మా అత్తగారు అన్నారు. ఆవారంలో నాకు
ఒక కల వచ్చింది.
“నేను
డ్యూల్ గావ్ రాజ్లా కి వెళ్ళాను.. (మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని పట్టణం). అక్కడ గుమ్మంలో మా నాన్నగారు నిలబడి ఉన్నారు. ఆయనను చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను ఆయనకి నారాయణ రావు ఫడ్కే గురించి చెప్పాను. నేను చెప్పిన విషయం విని మా నాన్నగారు మరింతగా సంతోషించి
వివాహ ప్రయత్నాలలో ముందుకు సాగమని చెప్పారు”.
అదే సంవత్సరంలో వివాహం జరిగింది. మా అమ్మాయి పల్లవి వివాహం సంతోష్ రాజ్వాడీతో నిశ్చయమయింది. మా అత్తగారికి సుస్తీ చేసింది. కష్ట సమయాలు రాబోతున్నాయని బాబా హెచ్చరించినట్లుగా నాకు భయంకరమయిన కల వచ్చింది. ఆ కలలో ఒక అబ్బాయి నా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ముందుకు నడుస్తూ ఉండగా ఒక గేదె నన్ను పొడవటానికి వస్తూ ఉంది. కాని మధ్యలో ఏమివచ్చింది తెలియదు కాని, దాని వల్ల నేను రక్షింపబడ్దాను. భవిష్యత్తులో ఏదో ఆపద సంభవించబోతోందని నాకు అనిపించింది.
వివాహ పత్రికలు పంచడానికి నాభర్త పూనా, ఔరంగాబాద్ లకు వెడదామని ప్రయాణం పెట్టుకున్నారు. డబ్బు, సమయం వృధా అని నేను రానని చెప్పాను. కాని నా భర్త నామాట వినలేదు. ఆఖరికి మేమిద్దరం పూనాకి బయలుదేరాము. ఖండాలా దగ్గరకు రాగానే మాకారు చెడిపోయింది. పెట్రోల్ టాంక్ లోనుండి పెట్రోలు కారుతుండటం వల్ల తొందరగానే టాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా కష్టంలో పడ్డాము. అదృష్టం కొద్ది మాకు అక్కడ ఒక గ్యారేజీ కనిపించింది. అక్కడ మేము రెండు గంటల పైగా ఉండవలసివచ్చింది. అక్కడంతా సరిచేయించుకున్న తరువాత మెకానిక్ మమ్మల్ని వెనక్కి తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. అందుచేత మేము ఇంటికి తిరిగి బయలుదేరి బాంద్రాకు చేరుకోగానే మరలా పెట్రోలు టాంకు ఖాళీ అయిపోయింది. నా భర్త నన్ను కారులోనే కూర్చోమని చెప్పి తను పెట్రోలు తీసుకురావడానికి వెళ్లారు. నేను గంటపైగా కారులోనే కూర్చున్నాను. అప్పటికి ఇంకా నాభర్త తిరిగి రాకపోవడంతో నాలో ఆందోళన మొదలయింది. కొంతమంది కుఱ్ఱవాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. నా భర్తను ఎక్కడయినా చూసారా అని వాళ్ళనడిగాను. నేనున్న చోటనుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉండటం చూశామని చెప్పారు. ఒక్కసారిగా అదిరిపడ్డాను. పడిపోయిన ఆవ్యక్తి ఎవరా అని చూడటానికి వెంటనే పరుగెత్తుకుని వెళ్లాను. అక్కడ నా భర్త రోడ్డు మీద పడి ఉన్నారు. చుట్టూ ఎవరూ లేరు. నా భర్తకు మధుమేహ వ్యాధి ఉంది. సుగర్ లెవెల్స్ కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వెంటనే ఒక రిక్షాను మాట్లాడుకుని ఇంటికి తీసుకువచ్చాను. బాబా నాభర్త జీవితాన్ని నిలబెట్టారు.
2005
వ.సంవత్సరంలో మా అల్లుడిగారింటికి వచ్చిన గురురాణి నాగకన్య యోగిని, జిమ్మి నాగపుత్ర
యోగి రాజ్ గార్లని దర్శించుకోవడానికి వెళ్లాను.
మా అల్లుడిగారి తల్లిదండ్రులు యోగిని, యోగిరాజ్ ల శిష్యులు. మా కుటుంబానికి వారి దీవెనలు లభిస్తూ ఉన్నాయి. మా అల్లుడు సతీష్ తల్లి మాకు ఒక చిన్నపెట్టెను ఇచ్చింది. దానిని నేను మాపడక గదిలో పెట్టుకున్నాను. ఒక రోజు నేను నాపడక గదిలో నిద్రిస్తూ ఉన్నాను. నాకు ఒక దృశ్యం కనిపించింది. నేను ఒక చాప మీద కూర్చున్నాను. ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను. నేనెంతో ఆనందంగా ఉన్నాను. మెల్లగా క్రిందకి వచ్చాను. నేను చీకటిలో నడుస్తూ ఉన్నాను. సొరంగంలా ఉన్న ఇల్లు కనిపించింది. నేను ఇంటిలోకి ప్రవేశించినపుడు బంగారువర్ణంతో లిఖింపబడిన
వాక్యం కనిపించింది. “జిమ్మి నాగపుత్ర యోగిరాజ్
మరియు గురునాని జిమ్మి నాగకన్య యోగిని”.
ఉజ్వలా
బోర్కర్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment