06.06.2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 12 వ, భాగమ్
అధ్యాయమ్
– 8
కలలు
- వాస్తవాలు
2003
వ.సంవత్సరంలో జరిగిన సంఘటన. మా చెల్లెలు నీతా
ఫోన్ లో మాట్లాడుతూ చెప్పిన విషయం. తనకు వచ్చిన
భయంకరమయిన స్వప్నం గురించి చెబుతూ, ఆకలలో నేను
నా స్వంత ఊరిలో బాలాజీ దేవాలయంలో ఉన్నట్లుగా కనిపించానని చెప్పింది. ఏదో ప్రమాదం జరగబోతూ ఉందని నాకర్ధమయింది. మరుసటి రోజునే , పూనాలోని రూబీ కో ఆపరేటివ్ బ్యాంక్
లో ఉద్యోగం చేసిన నా కజిన్ సోదరుడు అంబాదాస్ మరణించాడనే దుర్వార్త వినవలసి వచ్చింది.
అదే
వారంలో మా చిన్న చెల్లెలు అంజు తన వివాహం గురించి పని పురమాయిస్తున్నట్లుగా నాకు ఒక
కల వచ్చింది. దానికి కారణం తను అప్పుడప్పుడు
మా స్వంత ఊరిలోనే మా అమ్మగారితోనే ఉండేది.
నా సోదరుడు ఉద్యోగరీత్యా ఔరంగాబాద్ లో ఉండేవాడు. నా సోదరులిద్దరూ వేరే వేరే ఊళ్లలో ఉంటున్నారు. పూనాలో నివసిస్తున్న ధనంజయ్ ఖడెతో మా చెల్లెలి వివాహం
అదే నెలలో నిశ్చయింపబడింది.
మా
మేనత్త ఔరంగాబాద్ జిల్లాలోని దేవధైతన్ లో ఉంటోంది. వారు స్వర్గీయ సంత్ నింబరాజ్ మహరాజ్ గారి వారసులు. వాళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం. వారందరూ కలిసి మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో వైభవంగా
జరుపుకుంటారు. నా మేనత్త నన్ను కూడా మహాశివరాత్రికి
రమ్మని ఆహ్వానించింది. కాని నా భర్తకు కొన్ని
పనులు ఉండటం వల్ల తాను రాలేనని చెప్పారు.
నాభర్త
నన్ను వేరే పని మీద కర్జత్ కి తీసుకువెళ్ళినందువల్ల, మహాశివరాత్రికి మా మేనత్త ఇంటికి
వెళ్ళేందుకు సాధ్యమయేలా చూడమని బాబాను ప్రార్ధించుకున్నాను. కర్జత్ నుంచి నా భర్త నన్ను పూనాకి, పూనానుండి మహాశివరాత్రికి
దేవధైతన్ కి తీసుకువెళ్ళారు.
2013
మే 13 వ. తారీకున అక్షయతృతీయ పండగ సందర్భంగా పని ఒత్తిడితో నేను చాలా అలసిపోయాను. సాయిబాబావారి పాత విగ్రహాన్ని మేము కర్జత్ లో ఉంచాము. దానిని తీసుకుని రావడానికి నేను, మా అబ్బాయి అక్కడికి
వెళ్లాము. రాత్రి 10 గంటలకి మా అబ్బాయి ప్రసాద్ పెద్ద పూలదండను పట్టుకుని
వచ్చాడు. ఆ దండను ఎవరో తన దుకాణం ముందు పెట్టి
వెళ్లారనీ, రాత్రి పది గంటలయినా దానిని తీసుకోవడానికి ఎవ్వరూ రాలేదని చెప్పాడు. మరుసటి రోజు కూడా ఆ దండను తీసుకోవడానికి ఎవరూ రాలేదు.
బహుశా
ఆ దండను బాబావారే మాకు ఇచ్చారనీ దానిని తీసుకుని కర్జత్ కి వెళ్ళి అక్కడ ఉన్న పాత విగ్రహానికి
వేయమని బాబా సూచించినట్లుగా నాిపించింది. అందుచేత
మేము కర్జన్ కి వెళ్ళి బాబాకు పూజ చేసాము.
ఈ విధంగా సాయి ఎల్లప్పుడూ నావెంటే ఉన్నారనే
అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది.
ఉజ్వలా
బోర్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment