07.06.2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 13 వ, భాగమ్
అధ్యాయమ్
– 9
కల్ప
వృక్షమ్
కాకా
సాహెబ్ దీక్షిత్ జీవితంలో 1909 వ. సంవత్సరం నవంబరు 2 వ.తేదీ సువర్ణాక్షరాలతో లిఖింపబడవలసిన
రోజు. ఆరోజున కాకా సాహెబ్ మొట్టమొదటిసారిగా
సాయిబాబాను దర్శించుకున్నారు. ఆరోజు గురుసమర్పణ్
రోజు. ఆరోజును అందరూ ఎంతో భక్తితో జరుపుకుంటారు. సాయి భక్తులకి డిసెంబరు 2 వ. తేదీ కూడా చాలా ముఖ్యమయినదే. ఈ రోజునే గౌరవనీయులయిన సత్పతి గురూజి కాకాసాహెబ్
ట్రస్ట్ లో సుందరమయిన సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ట చేసారు. ఏ సామాన్య మానవుడికయినా ఒక దేవాలయాన్ని నిర్మించడమంటే
సాధ్యపడే విషయం కాదు. గురువు యొక్క దయ, అనుగ్రహం
ఉంటేనే అది సాధ్యపడుతుంది. వైదిక శాస్త్ర ప్రకారం
మనం పూర్వ జన్మలో చేసుకున్న మంచికర్మల వల్లనే అది సాధ్యపడుతుంది. తను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్లనే కాకాసాహెబ్
దీక్షిత్ కుటుంబంలో జన్మించానని ఆయన మనుమడు అనిల్ దీక్షిత్ అంటూ ఉంటారు.
దీక్షిత్
కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉంటూ ఉంటానని సాయిబాబా కాకాసాహెబ్ దీక్షిత్ కి మాట ఇచ్చారు. సాయిబాబా వారి ఆశీర్వాద అనుగ్రహం వల్లనే ఎటువంటి
విపత్తులలోనయినా మేము చాలా ప్రశాంతంగాను, సహనంతోను ఉండగలుగుతున్నాము. 1993 వ.సంవత్సరంలో నాకు 53 సంవత్సారాల వయసులో గుండె నొప్పి వచ్చింది. వైద్యులు చేయకలిగినంతగా తమ శక్తిమేర ప్రయత్నించినా
బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. బాబాకు సేవ చేసుకునేందుకు కొత్త జీవితాన్ని ప్రసాదించమని
బాబాను ప్రార్ధించుకుంటూ ఉన్నాను. గుండె ఆపరేషన్
విజయవంతంగా జరిగి నేను కోలుకోవడం అధ్బుతమే.
మన
భక్తి, ఎలా ఉంటుందంటే, పూజ చేసి ఆఖరున ఆరతి ఇవ్వడం వరకే పరిమితమయి
ఉంటుంది. కాని అంతకు మించి మనం సాయి మందిరం
గురించి ఆలోచించము. ఈ సంవత్సరం సత్పతి గురూజీ
మా ఇంటికి వచ్చి నన్ను ఎంతో ఆదరంగా ఆలింగనం చేసుకున్నారు. గురూజీ గారి వల్లనే మా ఇల్లు ఒక సాయి మందిరంగా మార్పు
చెందింది. సాయి చూపిన మార్గంలోనే పయనిద్దామనే
నిర్ణయానికి వచ్చాము. గురు అనుగ్రహంతోనే నేను
కుంభమేళాకు వెళ్ళడం ఇంకా ఎన్నో పవిత్ర క్షేత్రాలయిన అబూ గిర్నారు, నర్సోబావాడి, అక్కల్
కోట, షేన్ గావ్, గాణుగాపూర్ లను దర్శించడం జరిగింది.
గురూజీ
ఆశీర్వాదాలతో మేము 2003 వ.సంవత్సరం నవంబరు 2 వ.తారీకున ‘గురు సమర్పణ్’ రోజుగా ప్రారంభించాము. అనిల్ ఇంటివద్ద 2008 వ.సం.లో శంకుస్థాపన పూజా కార్యక్రమం
నిర్వహింపబడింది అందరు కూడా విరాళాలు ఇచ్చారు. ఎవరయినా సరే జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శ్రధ్ధ,
సబూరి అలవరచుకోవాలి. వాటిని సాధించాలంటే భగవన్నామ
స్మరణ చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఈ మందిరం
ఆధ్యాత్మికతకు, ధ్యానానికి కేంద్రంగా మారుతుంది.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment